- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
విజయ్ వర్మతో బ్రేకప్.. అసలు నిజాలు చెప్తూ తమన్నా ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ తమన్నా భాటియా(Tamannaah Bhatia) గత కొద్ది రోజుల నుంచి నటుడు విజయ్ వర్మ(Vijay Verma)తో రిలేషన్‌షిప్‌లో ఉన్న విషయం తెలిసిందే. త్వరలో వీరిద్దరు పెళ్లి కూడా చేసుకోబోతున్నారని అంతా అనుకున్నారు. ఈ క్రమంలోనే.. తమన్నా-విజయ్ వర్మ మనస్పర్థలు రావడంతో బ్రేకప్ చెప్పుకుని విడిపోయారని పలు పుకార్లు షికారు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో.. తాజాగా, ఓ పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్న తమన్నా ప్రేమ గురించి ఆసక్తికర కామెంట్స్ చేసి అందరికీ ఓ సలహా కూడా ఇచ్చింది. ‘‘ప్రేమకు శరతులు ఉండకూడదు. ఇది అన్నింటికీ వర్తిస్తుంది.
నీ పార్ట్‌నర్‌పై అంచనాలు పెట్టుకోవడం ప్రారంభించావంటే అది బిజినెస్‌గా మారుతుంది. కాబట్టి అలా చేయడం మారుకోండి. లేకపోతే గొడవలు వస్తాయి. ప్రేమకు, రిలేషన్‌కు మధ్య చాలా తేడా ఉంది. నువ్వు ఆ పని చేయాలి, ఈ పని చేయాలని ఆశిస్తే అది బిజినెస్‌లా మారుతుంది. ఇక నా విషయానికొస్తే.. నేనే ఎవరినైనా ప్రేమిస్తే వారిని స్వేచ్ఛగా వదిలేస్తాను. నచ్చినట్లుగా బతకనిస్తాను. సింగిల్‌గా ఉన్నప్పటి కంటే రిలేషన్‌లో ఉన్నప్పుడే ఎక్కువ సంతోషంగా ఉన్నాను. తోడు దొరికితే అంతకుమించిన సంతోషం ఏముంటుంది. కానీ ఎవర్నీ ఎంటుకుంటున్నావన్నది ముఖ్యం. ఎందుకంటే వారు నీ జీవితాన్ని ప్రభావితం చేసే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఆలోచించి ముందడుగు వేయండి’’ అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం తమన్నా కామెంట్స్ వైరల్ కావడంతో అందరికీ విజయ్ వర్మతో కలిసే ఉందనే క్లారిటీ వచ్చేసింది.