RRR: రామ్ చరణ్ ఇంట్రడక్షన్ సీన్‌లో ‘బ్రహ్మానందం’.. గూస్‌బంప్స్ తెప్పిస్తోన్న బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్

by Gantepaka Srikanth |
RRR: రామ్ చరణ్ ఇంట్రడక్షన్ సీన్‌లో ‘బ్రహ్మానందం’.. గూస్‌బంప్స్ తెప్పిస్తోన్న బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్
X

దిశ, వెబ్‌డెస్క్: హాస్య బ్రహ్మ, మీమ్ గాడ్, సోషల్ మీడియా కింగ్ అంటూ ఇలా ఎన్ని పేర్లతో బ్రహ్మానందం(Brahmanandam) పిలుచుకున్నా తక్కువే. ఇవాళ ఆయన పుట్టినరోజు సందర్భంగా ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్, ఫేస్‌బుక్ మోతమోగిపోతోంది. అన్ని ఫ్లాట్‌ఫాముల్లో ఆయన అభిమానులు బర్త్ డే(Brahmanandam Birthday) విషెస్ చెబుతున్నారు. ఎవరికి తోచిన విధంగా వారు ఫొటోలు, వీడియోలతో పోస్టులు పెడుతున్నారు. అన్నింటికంటే ఒక వీడియో మాత్రం అందరినీ ఆకట్టుకుటోంది. ఆర్ఆర్ఆర్ సినిమా(RRR Movie)లోని రామ్ చరణ్(Ram Charan) ఇంట్రడక్షన్ సీన్‌లో రామ్ చరణ్ స్థానంలో బ్రహ్మానందంను పెట్టి ఎడిట్ చేశారు. ఇందులో హీరోయిన్ నయనతారను యాడ్ చేశారు. అదుర్స్ సినిమాలో నయనతార(Nayanthara) కోసం బ్రహ్మానందం చేసిన ప్రయత్నాలు సైతం ఇందులో సెట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాను కుదిపేస్తోంది.

తెలుగు ఇండస్ట్రీ(Telugu Industry)నే కాకుండా.. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ(Indian Film Industry)లో ఎంతో కమెడియన్లు వచ్చారు.. పోయారు.. కానీ బ్రహ్మానందం మాత్రం ఎవర్‌గ్రీన్‌గా నిలిపోయారని కొనియాడుతున్నారు. ముఖ్యంగా తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని అంటున్నారు. గత 40 ఏళ్లుగా ఆయన తన హాస్యంతో ఎంతోమందిని నవ్వించారు.. తన నటనతో కొన్నిసార్లు ఏడిపించారు.. ఇప్పటికీ దిగ్విజయంగా సినిమాలు చేస్తూ కొనసాగుతున్నారు. అలాంటి బ్రహ్మానందం ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నారు. 69వ పడిలోకి అడుగుపెట్టిన బ్రహ్మీకి బర్త్‌డే విషెస్ వెల్లువగా వస్తున్నాయి.


Next Story

Most Viewed