పెళ్లి పీటలెక్కబోతున్న బిగ్ బాస్ కంటెస్టెంట్ .. నెటిజన్ల రియాక్షన్ ఇదే.. మంగళ స్నానం వీడియో వైరల్

by Kavitha |   ( Updated:2025-03-05 07:44:04.0  )
పెళ్లి పీటలెక్కబోతున్న బిగ్ బాస్ కంటెస్టెంట్ .. నెటిజన్ల రియాక్షన్ ఇదే.. మంగళ స్నానం వీడియో వైరల్
X

దిశ, వెబ్‌డెస్క్: తెలుగు ప్రేక్షకులకు బిగ్ బాస్ షో(Bigg Boss Show) అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కుటుంబ సభ్యులంతా ఈ షోను చూస్తూ ఎంజాయ్ చేస్తారు. ఇక ఇప్పటి వరకు 8 సీజన్లు పూర్తి చేసుకుంది బిగ్ బాస్ షో. అయితే చివరి సీజన్లో కన్నడ యాక్టర్ నిఖిల్(Nikhil) విన్నర్‌గా నిలిస్తే.. గౌతమ్(Gowtham) రన్నరప్ అయ్యాడు. ఇక సీజన్లో సీరియల్ యాక్టర్స్ బానే వచ్చారు. అందులో యష్మీ(Yashmi) ఒకరు. ఈ బ్యూటీ తన అందంతో వావ్ అనిపించిన తన బిహేవియర్‌తో మాత్రం వామ్మో అనిపించింది. ప్రతి చిన్న దానికి గొడవ చేస్తూ హెడ్ ఏక్‌గా మారిపోయింది.

అయితే రెండో వారంలోనే బయటికి వచ్చేస్తుందనుకుంటే చాలా వీక్స్ హౌస్‌లో ఉన్నది. ఇక హౌస్‌లో ఉన్నప్పుడు ఫస్ట్ గౌతమ్‌తో ప్రేమాయణం కొనసాగించిన ఈ బ్యూటీ అక్కా అని అతనితో పిలిపించుకుంది. ఆ తర్వాత నిఖిల్‌ను ట్రై చేసింది. కానీ అతను ఓకే చెప్పకుండా జస్ట్ ఫ్రెండ్‌లానే చూశానంటూ బిగ్ ట్విస్ట్ ఇచ్చాడు. ఇదిలా ఉంటే.. సామాజిక మాధ్యమాల్లో యష్మీ మంగళ స్నానం వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

అచ్చం పెళ్ళి కూతురిలా సిగ్గు పడుతూ మొహానికి పసుపు గంధం రాయించుకుని మంగళ స్నానం చేస్తుంది. అయితే ఇది రియల్ పెళ్లి కాదని రీల్ పెళ్లి అని తెలుస్తోంది. ఏదో సీరియల్‌లోని సీన్ అన్నట్లు కన్ఫమ్ అవుతుంది. ఇక అప్పటి వరకు రియల్ పెళ్లి అనుకున్న నెటిజన్లు అసలు విషయం తెలుసుకుని షాక్ అవుతున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. మరి మీరు ఓ సారి ఈ వీడియోను చూసేయండి.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి



Next Story

Most Viewed