ఎన్టీఆర్- ప్రశాంత్ నీల్ సినిమాపై బిగ్ అప్డేట్..టైగర్ వేట మొదలెడుతోందంటూ మేకర్స్ ఆసక్తికర ట్వీట్

by Hamsa |   ( Updated:2025-04-20 11:41:28.0  )
ఎన్టీఆర్- ప్రశాంత్ నీల్ సినిమాపై బిగ్ అప్డేట్..టైగర్ వేట మొదలెడుతోందంటూ మేకర్స్ ఆసక్తికర ట్వీట్
X

దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ హీరో ఎన్టీఆర్(NTR) ఇటీవల ‘దేవర’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ (Prashanth Neel)కాంబినేషన్‌లో ఓ భారీ ప్రాజెక్ట్ రాబోతున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా తారక్ నటిస్తోన్న 31వ చిత్రం కావడంతో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. పీరియాడిక్ మాస్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ మూవీలో తారక్ సరసన రుక్మిణీ వసంత్(Rukmini Vasanth) రొమాన్స్ చేయనుంది. అలాగే ఇందులో మలయాళ యంగ్ హీరో టొవినో థామస్ (Tovino Thomas)కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. అయితే ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ ఎర్నేని, యలమంచలి రవిశంకర్ నిర్మిస్తున్నారు.

రవి బస్రూర్ సంగీతం అందిస్తున్న ఈ పాన్ ఇండియా సినిమా వచ్చే ఏడాది జనవరి 9న థియేటర్స్‌లోకి రాబోతుంది. తాజాగా, ఈ చిత్రానికి సంబంధించిన అప్డేట్‌ ఇస్తూ మేకర్స్ ట్వీట్ చేశారు. ఏప్రిల్ 22 నుంచి తారక్ షూట్‌లో జాయిన్ కాబోతున్నట్లు తెలుపుతూ ఫొటోలను షేర్ చేశారు. అలాగే వేట మొదలవుతోంది’’ అనే క్యా్ప్షన్ జత చేసి ఫైర్ ఎమోజీలు షేర్ చేశారు. దీంతో ఈ విషయం తెలుసుకున్న నందమూరి అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. కాగా, తారక్ ఈ సినిమా తర్వాత ‘దేవర-2’ చేయబోతున్నారు. ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ ‘దేవర’కు సీక్వెల్‌గా తెరకెక్కుతోంది.

Click For Tweet Post..



Next Story