- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
మెగా అభిమానులకు బిగ్ గుడ్ న్యూస్.. ‘RC-16’ ఫస్ట్ లుక్ వచ్చేది ఆ రోజే!

దిశ, సినిమా: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram Charan), చిరంజీవి (Chiranjeevi)తనయుడిగా ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. ఇక ‘చిరుత’సినిమాతో హీరోగా మారిన ఆయన ‘రంగస్థలం’ చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. ఇక ‘ఆర్ఆర్ఆర్’(RRR) మూవీతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే దీనికి ఆస్కార్ అవార్డ్ కూడా వచ్చిన విషయం తెలిసిందే. ఇక ఇటీవల ‘గేమ్ చేంజర్’ (Game Changer)సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం భారీ అంచనాల మధ్య విడుదలై బాక్సాఫీసు వద్ద రాణించలేకపోయింది. అయితే హిట్ ఫ్లాప్‌తో సంబంధం లేకుండా రామ్ చరణ్ వరుస సినిమాలు ప్రకటిస్తూ ఫుల్ బిజీ బిజీగా గడుపుతున్నారు.
ప్రస్తుతం ఆయన బుచ్చిబాబు(Buchibabu) దర్శకత్వంలో ‘RC-16’ మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇందులో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. జగపతి బాబు(Jagapathi Babu), శివరాజ్ కుమార్, దివ్యేందు శర్మ కీలక పాత్రలో కనిపించనున్నారు. అయితే ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమం కూడా పూర్తి కాగా, ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ అయింది. కానీ ఎలాంటి అప్డేట్ విడుదల కాకపోవడంతో మెగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో.. తాజాగా, ‘RC-16’ సంబంధించిన ఓ వార్త నెట్టింట వైరల్ అవుతోంది. ఈ సినిమా టైటిల్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా మార్చి 27న విడుదల చేయనున్నట్లు సమాచారం. రామ్ చరణ్ టచ్ చేయని జానర్‌లో ఈ మూవీ రాబోతుండటంతో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.