- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
భగత్ సింగ్‌లా చరణ్, సుభాష్ చంద్రబోస్‌లా NTR.. అచ్చం గాంధీ తాతలా మరో స్టార్ హీరో

దిశ, వెబ్‌డెస్క్: అభిమాన హీరోలు స్వాతంత్ర్య సమరయోధుల (Freedom Fighters) గెటప్స్‌లో కనిపించినా, సినిమాలు తీసినా ఫ్యాన్స్ తెగ మురిసిపోతుంటారు. సీనియర్ ఎన్టీఆర్(Senior NTR) నటించిన మేజర్ చంద్రకాంత్ సినిమా (Major Chandrakant movie)లోని ‘పుణ్యభూమి నాదేశం’ పాటలో అన్ని గెటప్స్‌లో కనిపిస్తారు. ఆ సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా ‘పుణ్యభూమి నాదేశం’ పాట కొన్నాళ్ల పాటు ఓ ఊపు ఊపింది. ఎక్కడ చూసినా ఆ పాటే వినిపించేది. గణతంత్ర దినోత్సవం, స్వాతంత్య్ర దినోత్సవం, గాంధీ జయంతి వంటివి వచ్చినా ఆ పాటే వినిపించేది. ఆ పాటలో అనేకమంది ఫ్రీడమ్ ఫైటర్స్ గెటప్స్‌లో ఎన్టీఆర్ (Sr NTR) కనిపించి అలరించారు. తాజాగా సోషల్ మీడియాలో ప్రస్తుత స్టార్ హీరోలైన రామ్ చరణ్ (Ram Charan), జూనియర్ ఎన్టీఆర్ (Junior NTR), మళయాలం హీరో ఫహద్ ఫాసిల్ (Fahad Faasil), తమిళ హీరో విజయ్ సేతుపతి (Vijay Sethupathi) వంటి హీరోలను ఫ్రీడమ్ ఫైటర్స్ గెటప్‌లో ఫొటోలు ఎడిటింగ్ చేసి ఫ్యాన్స్ సోషల్ మీడియాలో పోస్టు చేశారు.
రామ్ చరణ్‌ను భగత్ సింగ్(Bhagat Singh)లా, ఎన్టీఆర్‌ను సుభాస్ చంద్రబోస్‌లా, ఫహద్ ఫాసిల్‌ను గాంధీ తాత(Gandhi Thatha)లా, విజయ్ సేతుపతిని అంబేద్కర్‌లా ఎడిట్ చేశారు. మిగతా హీరోలకు కూడా ఆయా గెటప్స్ సూట్ అవ్వగా.. ఫహద్ ఫాసిల్ మాత్రం అచ్చం గాంధీ తాతలాగే ఉన్నాడంటూ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. వీరంతా ఆయా స్వాతంత్ర్య సమరయోధుల జీవిత చరిత్రల్ని సినిమాల్లాగా తీసుకురావాలని రిక్వెస్ట్ చేస్తున్నారు. రామ్ చరణ్‌కు భగత్ సింగ్ లాంటి క్యారెక్టర్ పడితే బాక్సాఫీస్ షేక్ అవ్వడం ఖాయమని అభిప్రాయపడుతున్నారు. ఇక సుభాష్ చంద్రబోస్ గెటప్‌లో ఎన్టీఆర్ సైతం చింపేశాడని అంటున్నారు. కాగా, ప్రస్తుతం ఉప్పెన డైరెక్టర్ సుచ్చిబాబుతో రామ్ చరణ్ #RC16 అనే సినిమా చేస్తున్నారు.
దీనికి భారీ ఎత్తున ప్లాన్ చేశారు. ఏఆర్ రెహమాన్(AR Rahman) సంగీత దర్శకుడిగా, కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్, బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్, మిర్జాపూర్ సిరీస్ స్టార్ మున్నాభాయ్‌లు కీలక పాత్రల్లో చేస్తున్నారు. ఇక ఎన్టీఆర్.. హృతిక్ రోషన్‌తో కలిసి వార్-2లో నటిస్తున్నారు. అనంతరం ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో వచ్చే సినిమా కోసం సిద్ధమవుతున్నారు. తన అభిమాన హీరో కావడంతో ప్రశాంత్ నీల్ సైతం ఈ చిత్రాన్ని భారీ ఎత్తున ప్లాన్ చేస్తున్నారు. ఇక ఇటీవలే విడుదల-2తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విజయ్ సేతుపతి మెప్పించారు. పుష్ప-2 సినిమాతో ఫహద్ ఫాసిల్ తెలుగు ప్రేక్షకుల గుండెళ్లో స్థానం సంపాదించుకున్నారు.