- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
ఓటీటీ రిలీజ్‌కు 'బంగార్రాజు' రెడీ.. వచ్చేది అప్పుడే..
by Ajay kumar |

X
దిశ, వెబ్‌డెస్క్: అక్కినేని హీరోలు నాగార్జున, నాగచైతన్య కలిసి నటించిన తాజా సినిమా 'బంగార్రాజు'. సంక్రాంతి బరిలో విడుదలైన ఈ సినిమా అందరినీ మెప్పించింది. ఈ ఏడాది సంక్రాంతి బరిలో దిగిన బిగ్ హీరో మూవీ, బిగ్ హిట్ రెండూ కూడా 'బంగార్రాజు' ఖాతాలో వేసుకుంది. ఈ సినిమా ఓటీటీ రిలీజ్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే తాజాగా ఈ మూవీ ఓటీటీ రిలీజ్‌ను మేకర్స్ ఫిక్స్ చేశారు. ఈ మేరకు ఓటీటీ ఫ్లాట్‌ఫార్మ్ జీ5 అధికారిక ప్రకటన చేసింది. 'వాసివాడి తస్సాదియ్యా.. ఫిబ్రవరి 18 నుంచి సోగ్గాడు 'బంగార్రాజు' మన ఇంటికి వచ్చేస్తున్నాడు. ఎక్స్‌క్లూజివ్‌గా మీ జీ5 లో' అని ట్వీట్ చేసింది. దీంతో ఫిబ్రవరి 18న 'బంగార్రాజు' ఓటీటీలో దుమ్ముదులేపేస్తాడని అభిమానులు అంటున్నారు. మరి 'బంగార్రాజు' ఓటీటీలో కూడా ఆకట్టుకుంటాడో లేదో చూడాలి.
Next Story