- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
Salman Khan: సల్మాన్ ఖాన్ ‘సికందర్’ నుంచి సాంగ్ రిలీజ్

దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ (Salman Khan) నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘సికందర్’ (Sikander). కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఏఆర్ మురుగదాస్ (AR Murugadoss) దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో రష్మిక మందన్న (Rashmika Mandanna), కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal) హీరోయిన్స్‌గా నటిస్తుండగా.. సత్యరాజ్ కీలక పాత్రలో కనపించనున్నారు. నడియాద్వాలా గ్రాండ్‌సన్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సాజిత్ నడియాద్వాలా నిర్మిస్తున్నారు. ఇక ఈ మూవీ నుంచి ప్రతి అప్‌డేట్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకోగా.. భారీ అంచనాల మధ్య సికిందర్ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఈద్ కానుకగా థియేటర్స్‌లో విడుదల కానుంది. ఈ క్రమంలోనే ప్రమోషన్స్‌లో జోరు పెంచిన చిత్ర బృందం అప్‌డేట్స్ ఇస్తున్నారు. ఇందులో భాగంగా తాజాగా ఈ సినిమా నుంచి ‘భం భం భోలే’ (Bam Bam Bhole) సాంగ్ రిలీజ్ చేశారు. ఫాస్ట్ బీట్‌తో, హోలీ రంగులతో నిండిపోయిన ఈ సాంగ్‌లో సల్మాన్ ఖాన్ అండ్ రష్మిక మందన్న డాన్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.