Akshay Kumar: నన్ను అలా అడిగే ముందు నటీనటులను ప్రశ్నించండి.. అక్షయ్ కుమార్ సెన్సేషనల్ కామెంట్స్

by Hamsa |   ( Updated:2025-03-07 10:47:53.0  )
Akshay Kumar: నన్ను అలా అడిగే ముందు నటీనటులను ప్రశ్నించండి.. అక్షయ్ కుమార్ సెన్సేషనల్ కామెంట్స్
X

దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్(Akshay Kumar) గత ఏడాది ‘సింగం అగైన్’తో వచ్చి డిజాస్టర్‌ను చవిచూశారు. ఇటీవల ‘స్కై ఫోర్స్’(Sky Force) సినిమాతో ప్రేక్షకులను అలరించారు. కానీ హిట్ అందుకోలేక పోయారు. ఈ నేపథ్యంలో.. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. ‘‘నాకు స్టార్‌లా ఉండటం నచ్చదు. ఎందుకంటే నక్షత్రాలు కేవలం రాత్రి మాత్రమే వచ్చాయి కాబట్టి నేను సూర్యుడిలా ఉండాలని ఇష్డపడతాను. సూర్యుడి మాదిరిగా ఉదయాన్నే నిద్ర లేస్తాను. క్రమశిక్షణ విషయానికి వస్తే సానియా మీర్జానే ఉదాహరణ తీసుకోండి.

ఆమె ఎంత అద్భుతమైన ప్లేయర్. మనదేశం కోసం ఎన్నో పోటీల్లో పాల్గొన్న ఆమె చాలా బాగా ఆడింది. అలా ఎన్నో విజయాలు సాధించింది. ఉదయాన్నే నిద్ర లేవడం.. ప్రతిరోజు ఆట ప్రాక్టీస్ చేయడం అంత సులభం కాదు. కాబట్టి క్రమశిక్షణ లేకపోతే ఈ స్థాయికి వచ్చేదేమో మీరే అడిగి తెలుసుకోండి. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే చాలామంది విలేకర్లు నన్ను కలిసినప్పుడల్లా మీరెందుకు ఉదయాన్నే నిద్ర లేస్తారు అని ప్రశ్నిస్తుంటారు. నాకు తెలిసి దానికంటే చెత్త ప్రశ్న ఏమీ లేదు.

నన్ను అలాంటి ప్రశ్న అడిగే బదులు ఆలస్యంగా నిద్రలేచి సెట్‌కు లేట్‌గా వచ్చే నటీనటులను మీరెందుకు ఇలా ఉంటున్నారు అని అడగండి’’ అని చెప్పుకొచ్చారు. ఇక అక్షయ్ కుమార్ సినిమాల విషయానికొస్తే.. కేసరి చాప్టర్-2Kesari Chapter-2), జాలీ ఎల్ఎల్బీ-3, కన్నప్ప(Kannappa), హౌస్‌ఫుల్-5(Housefull-5), భూత్ బంగ్లా, వెల్‌కమ్ టు ది జంగిల్, హెరాఫెరీ-3 వంటి చిత్రాల్లో నటిస్తున్నారు. అన్ని షూటింగ్స్‌లో పాల్గొంటూ ఫుల్ బిజీ బిజీగా గడుపుతున్నారు.

Next Story

Most Viewed

    null