‘కల్కీ 2’ రిలీజ్ అయ్యేది అప్పుడే అంటూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసిన అశ్వనీదత్.. ఫుల్ ఖుషీలో ఫ్యాన్స్

by Kavitha |
‘కల్కీ 2’ రిలీజ్ అయ్యేది అప్పుడే అంటూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసిన అశ్వనీదత్.. ఫుల్ ఖుషీలో ఫ్యాన్స్
X

దిశ, సినిమా: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas) నటించిన ‘కల్కి 2898 ఏడీ’(Kalki 2898 AD) మూవీ ఈ ఏడాది జూన్‌లో విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. వైజయంతీ ప్రొడక్షన్స్‌(Vaijayanthi Productions) బ్యానర్‌పై అశ్వనీ దత్(Ashwinidat) నిర్మించిన ఈ సినిమాకు నాగ్ అశ్విన్(Nag Ashwin) దర్శకత్వం వహించాడు. ఇక ఈ చిత్రంలో బిగ్ బి అమితాబ్ బచ్చన్(Amitabh Bachchan), కమల్ హాసన్(Kamal Hassan), దీపిక పదుకొణె(Deepika Padukone), దిశా పటానీ(Disha Patani) ప్రధాన పాత్రల్లో నటించారు. అయితే ఈ చిత్రం తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ ఇలా అన్ని భాషల ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం రూ.1200 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించింది. అయితే ఈ చిత్రానికి సీక్వెల్ ఉన్నట్లు ఇప్పటికే మూవీ టీమ్ వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా ప్రముఖ నిర్మాత అశ్వనీదత్ చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అశ్వనీదత్ కల్కీ-2(Kalki-2) సినిమా పై ఆసక్తికర కామెంట్స్ చేశాడు. ఆయన మాట్లాడుతూ.. ‘కల్కీ-2 వచ్చే ఏడాది విడుదల అవుతుంది. సెకండ్ పార్ట్‌లో మొత్తం కమల్ హాసనే ఉంటారు. ప్రభాస్, కమల్ హాసన్‌ల మధ్య సన్నివేశాలు ఉంటాయి. అమితాబ్ బచ్చన్ పాత్రకు కూడా ప్రాధాన్యం ఉంటుంది. ఈ మూడు పాత్రలే ఎక్కువగా కనిపిస్తాయి. వీళ్లే ఆ సినిమాకు మెయిన్. వీళ్లతో పాటు దీపికా పదుకొణె పాత్రకు కూడా ప్రాధాన్యం ఉంటుంది. కొత్త వాళ్లు ఉంటారని నేను అనుకోవడం లేదు. ఒకవేళ కథకు అవసరమైతే రెండో పార్ట్‌లో కొత్త వాళ్లు ఉండే అవకాశం ఉంది’ అని చెప్పుకొచ్చారు. దీంతో ఆయన చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారగా.. డార్లింగ్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed