చిన్నప్పుడు అతని డ్యాన్స్ చూసి ఫిదా అయ్యి, డ్యాన్సర్ కావాలని ఫిక్స్ అయ్యాను.. సాయి పల్లవి

by Kavitha |
చిన్నప్పుడు అతని డ్యాన్స్ చూసి ఫిదా అయ్యి, డ్యాన్సర్ కావాలని ఫిక్స్ అయ్యాను.. సాయి పల్లవి
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సాయి పల్లవి(Sai Pallavi) గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు. ‘ప్రేమమ్’(Premam) సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈ భామ.. తన ఫస్ట్ సినిమాతోనే ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు సంపాదించుకున్నది. ఆ తర్వాత తెలుగులో ‘ఫిదా’(Fidaa) మూవీలో నటించి ఆడియన్స్‌ను ఫిదా చేసింది. అయితే సినిమాల్లో మేకప్ వేసుకోకపోవడం, గ్లామర్ ట్రీట్ ఇవ్వకపోవడం వంటి విషయాలతో ఈ ముద్దుగుమ్మ మరింత ఫేమ్ అయింది.

ఇక ఈ భామ డ్యాన్స్‌కి అయితే ప్రత్యేక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందనే చెప్పాలి. రీసెంట్‌గా నాగ చైతన్య(Naga chaitanya) హీరోగా చందూ మొండేటి(Chandoo Mondeti) దర్శకత్వంలో వచ్చిన ‘తండేల్’(Thandel) సినిమాలో హీరోయిన్‌గా నటించి అలరించింది. తన యాక్టింగ్‌తో ఆడియన్స్‌ నుంచి ఫుల్ మార్కులే కొట్టేసింది. లవర్స్ డే కానుకగా అల్లు అరవింద్ (Allu aravind) సమర్పణలో గీతా ఆర్ట్స్ బ్యానర్ పై బన్నీ వాసు(Bunny Vasu) నిర్మించిన ఈ సినిమా ఫిబ్రవరి 7న రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ విజయం సాధించింది.

అంతేకాకుండా నాగ చైతన్య కెరీర్‌లోనే అత్యంత భారీ వసూళ్లు రాబడుతున్న సినిమాగా తండేల్ నిలిచింది. ప్రస్తుతం ఈ బ్యూటీ బాలీవుడ్‌లో రణబీర్ కపూర్(Ranbeer Kapoor) నటిస్తున్న ‘రామాయణ’(Ramayana) మూవీలో నటిస్తుంది. ఇందులో సీత పాత్రలో అలరించనుంది. ఇదిలా ఉంటే.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సాయి పల్లవి మెగాస్టార్ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది.

ఆమె మాట్లాడుతూ.. ‘నేను చిన్నప్పుడు చిరంజీవి(Chiranjeevi) గారి ‘ముఠామేస్త్రి’(Mutamestri) సినిమా తెగ చూసేదాన్ని. ఆయన డ్యాన్స్‌కి ఫిదా అయ్యి, డ్యాన్సర్‌ని అవ్వాలని అనుకున్నాను. అప్పటినుంచే డ్యాన్స్ పై ఇంట్రెస్ట్ పెంచుకుని వివిధ షోలో పాల్గొన్నాను. అయితే ఓ ఈవెంట్‌లో చిరంజీవి గారితో డ్యాన్స్ చేశాను. అది నాకొక మరిచిపోలేని మెమరీ’ అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం నేచురల్ బ్యూటీ చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.




Next Story

Most Viewed