Pushpa-2: పుష్ప-2 చిత్రానికి మరో BIG షాక్.. షోలు రద్దు

by Gantepaka Srikanth |   ( Updated:2024-12-04 13:24:44.0  )
Pushpa-2: పుష్ప-2 చిత్రానికి మరో BIG షాక్.. షోలు రద్దు
X

దిశ, వెబ్‌డెస్క్: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) ప్రతిష్టాత్మక చిత్రమైన పుష్ప-2కు మరో బిగ్ షాక్ తగిలింది. మరికొన్ని గంటల్లో విడుదల ఉండగా.. కర్నాటకలో పుష్ప-2 మిడ్ నైట్ షోలను రద్దు చేశారు. ఉదయం 6 గంటలకు ముందు షోలకు అనుమతి లేదని బెంగళూరు కలెక్టర్ థియేటర్ల యాజమాన్యాలకు ఆదేశాలు జారీ చేశారు. కన్నడ ఫిల్మ్ ప్రొడ్యూసర్ల ఫిర్యాదుతో షోలు రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.

కాగా, అల్లు అర్జున్‌ (Allu Arjun) కథానాయకుడిగా నటిస్తున్న ‘పుష్ప-2 మూవీ(Pushpa-2 movie)ని ప్రపంచవ్యాప్తంగా 12 వేలకు పైగా స్క్రీన్‌లలో వివిధ ఫార్మాట్‌లలో విడుదల చేస్తున్నారు. సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందిన ఈ యాక్షన్‌ థ్రిల్లర్‌ను మొత్తం ఏడు ఫార్మాట్‌లలో (ఐమ్యాక్స్‌, డాల్బీ, డిబాక్స్‌, 4డీఎక్స్‌, ఐస్‌, 2డీ, 3డీ) విడుదల చేస్తున్నట్లు నిర్మాతలు ప్రకటించారు. అలాగే తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ, బెంగాలీ భాషల్లోనూ అందుబాటులోకి తెస్తున్నారు. మరికొన్ని గంటల్లో విడుదల కానుండగా.. అన్ని ఏర్పాట్లూ పూర్తి చేశారు. మరోవైపు ఆన్‌లైన్‌లో టికెట్‌ బుకింగ్స్‌ ఓపెన్‌ చేయగా హాట్‌ కేకుల్లా అమ్ముడయ్యాయి.


Also Read:

Pushpa-2: బన్నీ ఫ్యాన్స్‌కు బిగ్ షాక్.. పుష్ప-2 ఆ ఫార్మాట్‌లో రిలీజ్ అవ్వట్లేదట..?

Advertisement

Next Story