- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- వైరల్
Jani Master: జానీ మాస్టర్ కి మరో బిగ్ షాక్.. ఆ పిటిషన్ కొట్టేసిన కోర్టు.. వైరల్ అవుతున్న నటి ఝాన్సీ పోస్ట్
![Jani Master: జానీ మాస్టర్ కి మరో బిగ్ షాక్.. ఆ పిటిషన్ కొట్టేసిన కోర్టు.. వైరల్ అవుతున్న నటి ఝాన్సీ పోస్ట్ Jani Master: జానీ మాస్టర్ కి మరో బిగ్ షాక్.. ఆ పిటిషన్ కొట్టేసిన కోర్టు.. వైరల్ అవుతున్న నటి ఝాన్సీ పోస్ట్](https://www.dishadaily.com/h-upload/2025/01/29/415952-jhansi.webp)
దిశ, వెబ్ డెస్క్ : గత కొంత కాలం నుంచి టాలీవుడ్ ( Tollywood ) లో ఊహించలేని సంఘటనలు జరుగుతున్నాయి. ఒక దాని తర్వాత ఒకటి.. వస్తూనే ఉన్నాయి. కొందరైతే తెలుగు సినీ ఇండస్ట్రీకి ఏమైంది .. ఎన్నడూ లేనిది ఈ మధ్య కాలంలో వింత వింత ఘటనలు జరుగుతున్నాయంటూ కామెంట్స్ చేస్తున్నారు. డ్యాన్స్ కొరియోగ్రాఫర్ గా మంచి పేరు తెచ్చుకున్న జానీ మాస్టర్ ( jani master) పై ఓ మహిళా కొరియోగ్రాఫర్ లైంగిక వేధింపుల కేసు పెట్టగా పోలీసులు అతన్ని అరెస్ట్ చేసి జైలుకి తీసుకెళ్ళారు. దీంతో, అతను కొన్నాళ్లు జైల్లోనే ఉండి బెయిల్ పై రీసెంట్ గా బయటకు వచ్చాడు. ప్రస్తుతం, ఇంక ఇక్కడే ఉండి మళ్ళీ డ్యాన్స్ వర్క్స్ లో బిజీ అవ్వాలని చూస్తున్నారు. అయితే తాజాగా, ఫిలిం ఇండస్ట్రీ ( Film industry ) కమిటీ మెంబర్ అయిన ఝాన్సీ దీనికి సంబంధించిన ఓ పోస్ట్ పెట్టింది. ఇది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఝాన్సీ ( Jhansi ) తన పోస్ట్ లో.. " జిల్లా కోర్టులో ఛాంబర్స్ ఆదేశాలను సవాలు చేసిన కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ ( jani master ) పై ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ కేసు గెలిచింది. ఈ రోజు ఆయన మధ్యంతర పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది. ఇది చాలా ముఖ్యమైన తీర్పు. పని చేసే ప్రదేశాల్లో మహిళల భద్రతకు ప్రాధాన్యత ఉందని, POSH మార్గదర్శకాలను అమలు చేసే సంస్థలకు మద్దతు ఉందని రుజువైంది. ఫెడరేషన్ ఈ విషయంలో కఠినంగా వ్యవహరించి, ధర్మం వైపు నిలబడి పోరాటం చేసిన తెలుగు చలనచిత్ర వాణిజ్య మండలికి నా ప్రత్యేక ధన్యవాదాలు" అని తెలిపింది.
జానీ మాస్టర్ ( jani master ) పై ఆరోపణలు చేసిన కొరియోగ్రాఫర్ ఫిలిం ఛాంబర్ లైంగిక వేధింపుల పరిష్కార కమిటీలో కూడా ఫిర్యాదు చేసింది. దీనిపై, వెంటనే ఆ కమిటీ విచారణ చేపట్టారు. అలాగే, జానీ మాస్టర్ ని డాన్సర్ అసోసియేషన్ అధ్యక్ష పదవి నుంచి తప్పించాలని ఫెడరేషన్ ను ఫిలిం ఛాంబర్ కోరింది. అయితే, కేసు కోర్టులో ఇంకా అప్రూవ్ అవ్వకుండా ఎలా తప్పిస్తారంటూ జానీ మాస్టర్ కోర్టులో పిటిషన్ వేసినట్టు తెలిసిన సమాచారం. ఇప్పుడు, ఆ పిటిషన్ ని కోర్టు కొట్టివేయడంతో ఝాన్సీ తన సంతోషాన్ని అందరికీ తెలియజేస్తూ ఈ పోస్ట్ పెట్టింది.