Anil Ravipudi : నాకు కొంచెం తుత్తర ఎక్కువ.. అందుకే ఆ స్టార్ హీరోతో సినిమా మిస్ అయింది.. అనిల్ రావిపూడి కామెంట్స్

by sudharani |
Anil Ravipudi : నాకు కొంచెం తుత్తర ఎక్కువ.. అందుకే ఆ స్టార్ హీరోతో సినిమా మిస్ అయింది.. అనిల్ రావిపూడి కామెంట్స్
X

దిశ, సినిమా: ప్రజెంట్ టాలీవుడ్ ఇండస్ట్రీ (Tollywood Industry)లో సక్సెస్ ఫుల్ (Successful) డైరెక్టర్‌గా దూసుకుపోతున్నాడు అనిల్ రావిపూడి (Anil Ravipudi). డైరెక్టర్‌గా తన కెరీర్ స్టార్ట్ చేసిన అనతి కాలంలోనే స్టార్ దర్శకుడిగా మారిపోయాడు అనిల్. బ్యాక్ టు బ్యాక్ (Back to back) సినిమాలు తీయడమే కాకుండా ప్రతీ సినిమా బ్లాక్ బస్టర్ హిట్‌ (Blockbuster)ను సొంతం చేసుకుంది. ఈ క్రమంలోనే ఆయన తీసిన చిత్రాల్లో ఐదు సినిమాలు (పటాస్, రాజా ది గ్రేట్, సరిలేరు నీకెవ్వరు, భగవంత్ కేసరి, సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రాలు బాక్సాఫీస్ (box office) వద్ద సంచలన వసూళ్లను రాబట్టాయి. ఇందులో రీసెంట్‌ (Recent)గా వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం (sankranthiki vasthunnam) సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సంక్రాంతి స్పెషల్‌గా జనవరి 14న థియేటర్లలో విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షాన్ని కురిపిస్తోంది. ఈ క్రమంలోనే వరుస ఇంటర్వ్యూస్‌లో పాల్గొంటున్న అనిల్ రావిపూడి ఎన్టీఆర్‌తో మిస్ అయిన సినిమా గురించి చెప్పుకొచ్చాడు.

‘కల్యాణ్ రామ్‌ (Kalyan Ram)తో ‘పటాస్’ (Patas) సినిమా సక్సెస్ కాగానే.. ఎన్టీఆర్‌ (NTR)తో మూవీ చేద్దాం అనుకున్నాను. కథ కూడా వినిపించాను. ఆయన కొంచెం సమయం కావాలని అడిగారు. అయితే.. నేను గ్యాప్ ఇవ్వాల్సింది. కానీ నాకు కొంచెం తుత్తర ఎక్కువ. చిటీకి మాటికి అక్కడకు వెళ్లి కథ వినిపించేవాడిని. ఈ క్రమంలోనే దిల్ రాజు, రవితేజ కాంబోలో ‘రాజా ది గ్రేట్’ సినిమా ఆఫర్ వచ్చింది. ఇక వెంటనే మూవీ చేయాలనే ఆలోచనలతో అది ఒప్పేసుకున్నాను. కొంచెం వెయిట్ చేసి కథ ఇంకాస్త బెటర్‌గా రాసి ఉంటే.. ఎన్టీఆర్‌తో సినిమా వచ్చేది. అయినా ఆయన ఒప్పుకుంటే ఎప్పటికైన ఎన్టీఆర్‌తో ఓ సినిమా చేస్తాను’ అని చెప్పుకొచ్చారు. కాగా.. అనిల్ రావిపూడి డైరెక్టర్‌గా చేసిన మొదటి సినిమా ‘పటాస్’ మంచి సక్సెస్‌ను అందుకుంది. ఆయన కామెడీ టచ్ ప్రేక్షకులను విపరీతంగా నచ్చడంతో క్రేజీ ఫాలోయింగ్ పెంచేసుకున్నాడు అనిల్ రావిపూడి.

Advertisement

Next Story

Most Viewed