Matru: హృదయాన్ని హత్తుకుంటోన్న ‘అపరంజి బొమ్మ.. మా అమ్మ’ పాట..

by sudharani |
Matru: హృదయాన్ని హత్తుకుంటోన్న ‘అపరంజి బొమ్మ.. మా అమ్మ’ పాట..
X

దిశ, సినిమా: మదర్ సెంటిమెంట్‌ (Mother sentiment)తో వచ్చిన చిత్రాలన్నీ ఇంత వరకు బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఇదే మదర్ సెంటిమెంట్‌తో ఓ చిత్రం రాబోతోంది. శ్రీరామ్ (Sriram), నందినీ రాయ్ (Nandini Roy), సుగి విజయ్ (Sugi Vijay), రూపాలి భూషణ్ (Rupali Bhushan) తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం ‘మాతృ’ (Matru). జాన్ జక్కీ (John Zucky) దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను శ్రీ పద్మిని సినిమాస్ బ్యానర్‌పై శ్రీ పద్మ సమర్పణలో బి. శివ ప్రసాద్ నిర్మిస్తున్నాడు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ‘మాతృ’ చిత్రాన్ని త్వరలో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సిద్దమవుతున్నారు చిత్ర బృందం. ఈ క్రమంలోనే అప్పుడే ప్రమోషన్స్ స్టార్ట్ చేసి వరుస అప్‌డేట్స్ ఇస్తున్నారు.

ఇందులో భాగంగా తాజాగా ఈ చిత్రం నుంచి టైటిల్‌ (Title)కు తగ్గట్టుగా సాగే ఓ మదర్ సెంటిమెంట్‌తో ఎమోషనల్ సాంగ్‌ను రిలీజ్ చేశారు. ‘అపరంజి బొమ్మ.. మా అమ్మ’ (Andala Bomma.. Ma Amma) అంటూ సాగే ఈ పాటను దినేశ్ రుద్ర ఆలపించగా.. బి. శివ ప్రసాద్ సాహిత్యాన్ని అందించారు. అందరి హృదయాల్ని కరిగించేలా ఉన్న ఈ సాంగ్ ప్రస్తుతం యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లో ఉంది. అంతే కాకుండా.. ఈ సినిమా నిర్మాతే ఇంతటి గొప్ప పాటను రాయడం విశేషం.




Next Story