- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
Anasuya: పవన్‌తో నటించడంపై స్పందించిన అనసూయ..నాపై వచ్చే ట్రోల్స్‌కు కారణం అదేనంటూ కీలక వ్యాఖ్యలు!

దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ యాంకర్ అనసూయ(Anasuya Bharadwaj)కు పరిచయం అక్కర్లేదు. ఈ అమ్మడు జబర్దస్త్ షో ద్వారా వచ్చి తన అందం, మాటలతో ఫుల్ పాపులారిటీ సంపాదించుకుంది. అంతేకాకుండా అమ్మడు అందాలతో అందరినీ మెస్మరైజ్ చేసి పలు షోస్‌లోనూ యాంకర్‌గా వ్యవహరించే చాన్స్ అందుకుంది. ఇక కొద్ది కాలం పాటు యాంకర్‌గా కొనసాగిన అనసూయ నటిగా మారి వరుస చిత్రాల్లో నటిస్తోంది. ఇక గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) ‘రంగస్థలం’ (Rangasthalam)సినిమాలో రంగమ్మత్త పాత్రలో నటించి ఓవర్ నైట్ స్టార్‌గా మారిపోయింది. ఇక ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) ‘పుష్ప-2’ (Pushpa 2: The Rule)మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ తన ఖాతాలో వేసుకున్న ఆమె అదే ఫామ్‌తో స్టార్ హీరో సినిమాల్లో నటించే అవకాశాన్ని అందుకుంటూ దూసుకుపోతుంది.
ప్రస్తుతం అనసూయ ‘హరిహర వీరమల్లు’ మూవీలో కీలక పాత్రలో నటిస్తుంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan), క్రిష్, జ్యోతి కృష్ణ కాంబోతో వస్తుంది. ఇందులో నిధి అగర్వాల్(Nidhi Agarwal) హీరోయిన్‌గా నటిస్తుండగా.. అర్జున్ రాంపాల్, బాబీ డియోల్, అనుపమ్ కేర్, పూజా పొన్నాడ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. అయితే ఈ చిత్రాన్ని మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఎంఎం రత్నం నిర్మిస్తుండగా.. పీరియాడికల్ యాక్షన్ ఫిల్మ్‌గా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇక ఇటీవల మూవీ మేకర్స్ ‘హరిహర వీరమల్లు’ మూవీ నుంచి సెకండ్ సింగిల్ రాబోతున్నట్లు తెలుపుతూ కొల్లగొట్టినాదిరో ప్రోమో వీడియో షేర్ చేసిన విషయం తెలిసిందే.
ఇందులో అనసూయ, పూజా పొన్నాడ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారు. ఇక ఈ సాంగ్ ఫిబ్రవరి 24న రాబోతుండటంతో పవన్ అభిమానుల్లో ఆసక్తి పెరిగిపోయింది. ఈక్రమంలో.. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అనసూయ కీలక వ్యాఖ్యలు చేసింది. ‘‘పవన్‌తో డ్యాన్స్ చేయడం గర్వంగా ఉంది. ఆ సాంగ్ చాలా బ్యూటీఫుల్‌గా ఉంటుంది. నేను ఎప్పటినుంచో ఈ సాంగ్ విడుదల కోసం ఎదురుచూస్తున్నాను. కానీ పవర్ స్టార్ ఏపీ రాజకీయాల్లో బిజీగా ఉండటం వల్ల ఆలస్యమవుతూ వచ్చింది. ఫైనల్లీ ఫిబ్రవరి 24న విడుదల కాబోతుంది. ఏదేమైనా పవర్ సార్ డిప్యూటీ సీఎం కావడం గర్వంగా అనిపిస్తుంది. అయితే గతంలో నాపై ట్రోల్స్ వచ్చాయి. అది కూడా డ్యాన్స్ చేయడం వల్లనే. కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్‌తో కలిసి డ్యాన్స్ వేయడం ఫస్ట్ టైమ్ సినిమాటిక్ వేలోఫెర్ఫామ్ చేయడంతో వాటన్నింటికీ సమాధానం అవుతుందని భావిస్తున్నాను’’ అని చెప్పుకొచ్చింది. అనసూయ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.