రాజ్ తరుణ్-లావణ్య కేసులో ఊహించని ట్విస్ట్.. వైరల్‌గా మారిన సంచలన వీడియో.. అడ్డంగా దొరికిపోయారుగా!

by Hamsa |
రాజ్ తరుణ్-లావణ్య కేసులో ఊహించని ట్విస్ట్.. వైరల్‌గా మారిన సంచలన వీడియో.. అడ్డంగా దొరికిపోయారుగా!
X

దిశ, సినిమా: గత కొద్ది రోజుల నుంచి టాలీవుడ్ యంగ్ హీరో రాజ్ తరుణ్(Raj Tarun), లావణ్య(Lavanya) రిలేషన్‌షిప్ హాట్ టాపిక్‌గా మారిన సంగతి తెలిసిందే. అయితే ఈ కేసులో రాజ్ తరుణ్‌ను కోర్ట్ ఊరటనివ్వడంతో కొద్ది కాలంపాటు లావణ్య సైలెంట్‌గా ఉంది. ఇక ఇటీవల మళ్లీ రాజ్ తరుణ్ తల్లిదండ్రులు తనపై దాడి చేయించారని చెప్పి లావణ్య విడుదల చేసిన వీడియో సంచలన సృష్టించింది. ఇందులో ఆమె ‘‘రాజ్ తరుణ్ వాల్ల తల్లిదండ్రులు నేను ఉంటున్న ఇంటి దగ్గరకు 15 మందిని తీసుకుని వచ్చారు.15 మందిని తీసుకొచ్చి నాపై దాడి చేయించారు. నా ప్రైవేట్ పార్ట్స్‌ను నలిపేశారు. ఆ 15 మంది పైనుంచి నా జుట్టు పట్టుకుని లాకొని వచ్చారు.

అయితే రాజ్ వాళ్ళ అమ్మనాన్న మాత్రం వాళ్లను ఆపలేదు. వాళ్ల ప్లాన్ అంతా నన్ను ఇక్కడి నుంచి పంపించాలనే. కేసు కోర్టులో ఉంది. ఇలా చేయడమేంటని అతన ఆవేదన వ్యక్తం చేసింది. ఇక ఈ క్రమంలోనే రాజ్ తరుణ్ తల్లిదండ్రులు ఆమె ఇంటి ముందు దర్నాకు దిగారు. దీనిపై లావణ్య కేసు కూడా పెట్టింది. నాపై రాత్రి దాడి చేశారని న్యాయం చేయకపోతే పోలీస్ స్టేషన్ ముందే ప్రాణాలు వదిలేస్తానని ప్రాణహాని ఉందని చెప్పినా పట్టించుకోవడం లేదని ఆరోపణలు చేసింది. ఇదిలా ఉంటే.. తాజాగా, ఓ సెన్సేషనల్ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇందులో రాజ్ తరుణ్, లావణ్య జంటగా నిలబడి ఆశీర్వాదం తీసుకుంటూ కనిపించారు. ఇక వారు కూడా సంతోషంగా కొడుకు కొడలిని తలంబ్రాలు వేసి మరీ ఆశీర్వాదించారు. ఇక ఈ వీడియో చూసిన వారంతా రకరకాల కామెంట్లు చేస్తున్నారు.



Next Story

Most Viewed