- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
అల్లు అరవింద్ నాకు తండ్రితో సమానం.. నేచురల్ బ్యూటీ షాకింగ్ కామెంట్స్.. ఆందోళనలో ఫ్యాన్స్

దిశ, సినిమా: నేచురల్ బ్యూటీ సాయి పల్లవి(Sai Pallavi) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ‘ప్రేమమ్’(Premam) మూవీతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈ భామ.. తన ఫస్ట్ సినిమాతోనే కుర్రాళ్ల క్రష్ అయిపోయింది. దీంతో వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. అలా ‘ఫిదా’(Fidaa) మూవీతో టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయం అయింది. అయితే ఈ అమ్మడు సినిమాల్లో నేచురల్‌గా నటించడం, మేకప్ వేసుకోకపోవడం, బోల్డ్ సీన్స్‌లో యాక్ట్ చేయకపోవడం వంటి రీజన్స్ వల్ల మరింత ఫేమ్ అయింది. ఇక ఈ ముద్దుగుమ్మ డ్యాన్స్‌కి ప్రత్యేక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందనే చెప్పాలి.
ప్రస్తుతం ఈ భామ బాలీవుడ్‌లో ‘రామాయణం’(Ramayanam) మూవీలో నటిస్తోంది. అలాగే అక్కినేని నాగచైతన్య(Akkineni Naga Chaitanya) సరసన ‘తండేల్’(Thandel) చిత్రంలో నటిస్తోంది. చందు మొండేటి(Chandu Mondeti) దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని.. అల్లు అరవింద్(allu Aravind) సమర్పణలో గీతా ఆర్ట్స్ బ్యానర్ పై బన్నీ వాసు(Bunny Vasu) నిర్మిస్తున్నారు. కాగా ఈ చిత్రం లవర్స్ డే కానుకగా ఫిబ్రవరి 14న గ్రాండ్‌గా థియేటర్లలో రిలీజ్ కానుంది. ఇక విడుదల తేదీ దగ్గర పడడంతో మూవీ టీమ్ ప్రమోషన్ల జోరు పెంచింది. ఇందులో భాగంగా రీసెంట్‌గా చెన్నై వేదికగా ట్రైలర్ ఈవెంట్ నిర్వహించింది.
ఈ నేపథ్యంలో సాయిపల్లవి అల్లు అరవింద్ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. ఆమె మాట్లాడుతూ.. ‘మా తండేల్ యూనిట్‌ను ఆశ్వీర్వదించడానికి ఇక్కడకు వచ్చిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. ముందుగా ఈ కథను రియల్ స్టోరీ లాగా చెప్పారు. కానీ తర్వాత దాన్ని అందమైన ప్రేమ కథగా మార్చారు. ఈ జర్నీకి మూడేళ్లు సమయం పట్టింది. పిక్చరైజేషన్‌కి ఏడాదిన్నర సమయం పట్టింది. చైతన్య అద్భుతంగా తన పాత్రలో ఒదిగిపోయి ప్రాణం పెట్టి నటించాడు.
దేవీశ్రీ(Devi Sri Prasad) గారు అందమైన పాటలను ఇచ్చారు. సినిమా రిలీజ్‌కు ముందే ఆడియన్స్ పాటలను పెద్ద హిట్ చేసి మా అందరికీ ఎనర్జీని ఇచ్చారు. అరవింద్ గారు నాకు తండ్రితో సమానం. ఏడాదిన్నరపాటు సినిమాను షూట్ చేసినప్పుడు ఎక్కడా ఇబ్బంది లేకుండా మా టీమ్‌కు సపోర్ట్‌ను అందించారు. కరుణాకరన్(Karunakaran) గారికి తెలుగు ఇండస్ట్రీలో స్వాగతం చెబుతున్నాను. అద్భుతంగా నటించారు. ఈ జర్నీలో నేను చాలా విషయాలు నేర్చుకున్నాను.
ఫిబ్రవరి 7న సినిమా రిలీజ్ అవుతుంది. తప్పకుండా మీ అందరికీ ఈ మూవీ నచ్చుతుంది’ అని చెప్పుకొచ్చింది సాయిపల్లవి. దీంతో ఈమె చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారగా.. అల్లు అరవింద్ ఫాదర్ లాంటి వాడంటే అల్లు అర్జున్(Allu arjun) బ్రదర్‌తో సమానం. మరి ఈ జన్మలో వీరిద్దరి కాంబోలో మనం మూవీ చూడలేమా అంటూ ఫ్యాన్స్, నెటిజన్లు ఆందోళన చెందుతున్నారు.
Read More..
ఆ హీరోయిన్ కోసం స్పెషల్‌గా లంచ్ బాక్స్ పంపించిన ప్రభాస్.. ఫొటోలు వైరల్