కిల్లింగ్ లుక్స్‌తో కట్టిపడేస్తున్న అల్లు అర్జున్ బ్యూటీ.. ఆ ఎమోజీతో కామెంట్స్ చేస్తున్న నెటిజన్లు

by Kavitha |
కిల్లింగ్ లుక్స్‌తో కట్టిపడేస్తున్న అల్లు అర్జున్ బ్యూటీ.. ఆ ఎమోజీతో కామెంట్స్ చేస్తున్న నెటిజన్లు
X

దిశ, సినిమా: ‘దేశముదురు’(Desamuduru) సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్ హన్సిక మోత్వానీ(Hanshika Mothvani) గురించి స్పెషల్‌గా చెప్పనక్కర్లేదు. తన ఫస్ట్ మూవీతోనే మంచి గుర్తింపు సంపాదించుకున్నది. అలాగే తన అందం, అభినయంతో ప్రేక్షకులను కట్టి పడేసింది. దీంతో ఈ భామకు వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. అలా వచ్చిన అవకాశాలన్నింటిని సద్విని యోగం చేసుకుంటూ హీరోయిన్‌గా రాణించింది. ఇక కెరీర్ పీక్స్‌లో ఉన్నప్పుడే తన బాయ్ ఫ్రెండ్‌తో మూడు ముళ్లు వేయించుకుంది. అప్పటి నుంచి సినిమాలకు దూరమైన ఈ బ్యూటీ.. మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చింది.

ప్రస్తుతం ఈటీవీ(ETV)లో ప్రసారమయ్యే ‘ఢీ జోడి’(Dhee Jodi) అనే డ్యాన్స్ షోకు జడ్జ్‌గా వ్యవహరిస్తుంది. అలాగే నిత్యం సోషల్ మీడియా(Social Media)లో యాక్టీవ్‌గా ఉంటూ అందాల విందును వడ్డిస్తుంది. ఈ క్రమంలో ఈ బ్యూటీ పిక్స్ నెట్టింట వైరల్‌గా మారాయి. తాజాగా హన్సిక తన ఇన్‌స్టా(Insragram) వేదికగా కొన్ని ఫొటోలు షేర్ చేసింది. అందులో మెరూన్ అండ్ బ్లాక్ కాంబినేషన్ డ్రెస్ వేసుకుని కిల్లింగ్ లుక్స్‌తో కట్టిపడేస్తూ ఫొటోలకి పోజులిచ్చింది. దీంతో ఈ పిక్స్ కాస్తా నెట్టింట వైరల్‌గా మారాయి. ఇక వీటిని చూసిన నెటిజన్లు ఫైర్(Fire) సింబల్ జోడిస్తూ సూపర్ బ్యూటీ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Next Story

Most Viewed