విడుదలైన రెండేళ్ల తర్వాత ఓటీటీలోకి వస్తున్న అఖిల్ ‘ఏజెంట్’ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?

by Hamsa |
విడుదలైన రెండేళ్ల తర్వాత ఓటీటీలోకి వస్తున్న అఖిల్ ‘ఏజెంట్’ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
X

దిశ, సినిమా: అక్కినేని అఖిల్(Akkineni Akhil) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. చైల్డ్ ఆర్టిస్ట్‌గా సినిమా ఇండస్ట్రీకి వచ్చిన అఖిల్ హీరోగా మారాడు. పలు చిత్రాల్లో నటించి ఫుల్ పాపులారిటీ దక్కించుకున్నాడు. కానీ స్టార్ హీరో కాలేకపోయాడు. చివరగా అఖిల్ నటించిన ‘ఏజెంట్’ (Agent)బాక్సాఫీసు వద్ద భారీ డిజాస్టర్‌గా నిలిచింది. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో సాక్షి వైద్య(Sakshi Vaidya) హీరోయిన్‌గా నటించింది. ఇందులో మమ్ముట్టి(Mammootty) కీలక పాత్రలో కనిపించారు. స్పై యాక్షన్ చిత్రంగా వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. దీంతో ఓటీటీలోనూ స్ట్రీమింగ్ చేయలేదు. డేట్ ప్రకటించినప్పటికీ అనివార్య కారణాల వల్ల వాయిదా పడింది. తాజాగా, ‘ఏజెంట్’ విడుదలైన రెండేళ్లకు డిజిటల్ స్ట్రీమింగ్‌కు రెడీ అయినట్లు అధికారిక ప్రకటన విడుదలైంది.

ఈ సినిమాకు సంబంధించిన ఓటీటీ హక్కులను ప్రముఖ సంస్థ సోనీ లీవ్‌ సొంతం చేసుకోగా.. మార్చి 14 నుంచి తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో స్ట్రీమింగ్ అందుబాటులోకి రాబోతున్నట్లు వెల్లడించారు. కాగా, ఈ సినిమా తర్వాత నుంచి అఖిల్ ఇండస్ట్రీకి కాస్త గ్యాప్ ఇచ్చాడు. కొద్ది రోజులుగా కాళీగా ఉంటున్నారు. ఈ క్రమంలోనే నాగార్జున అఖిల్- జైనబ్‌తో నిశ్చితార్థం జరిపించారు. ఇక సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం ‘లెనిన్’ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఇందులో క్రేజీ బ్యూటీ శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తుంది. అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మిస్తున్నారు. షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలోనే విడుదల కాబోతుంది.

Next Story

Most Viewed