‘అఖండ-2’ మాములుగా ఉండదు.. మీరు ముందే ప్రిపేర్ అవ్వండి.. హైప్ పెంచిన తమన్ కామెంట్స్

by Hamsa |   ( Updated:2025-01-23 09:54:33.0  )
‘అఖండ-2’ మాములుగా ఉండదు.. మీరు ముందే ప్రిపేర్ అవ్వండి.. హైప్ పెంచిన తమన్ కామెంట్స్
X

దిశ, సినిమా: నందమూరి బాలకృష్ణ( Balakrishna ) ఇప్పటికీ ఫుల్ ఎనర్జీతో వరుస చిత్రాల్లో నటిస్తూ బ్లాక్ బస్టర్ హిట్స్‌ సాధిస్తున్నారు. ప్రస్తుతం బాలయ్య, బోయపాటి శ్రీను(Boyapati Srinu) కాంబినేషన్‌లో ‘అఖండ-2’(Akhanda-2) సినిమా రాబోతుంది. 2025 సెప్టెంబర్ 25న ప్రపంచవ్యాప్తంగా థియేటర్స్‌లో విడుదల కానుంది. అయితే ఇప్పటికే ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ కూడా మొదలైంది. ఇటీవల కుంభమేళాలో కూడా పలు సీన్స్ పూర్తి చేశారు. అంతేకాకుండా ఇందులోంచి విడుదలైన పోస్టర్స్ అంచనాలను రెట్టింపు చేశాయి. దీంతో ‘అఖండ-2’ నుంచి ఎప్పుడెప్పుడు అప్డేట్స్ వస్తాయా అని అభిమానులు ఎదురుచూస్తున్నారు.

ఈ నేపథ్యంలో.. తమన్ ‘డాకు మహారాజ్’ సక్సెస్ మీట్‌లో పాల్గొని ఆసక్తికర కామెంట్స్ చేశారు. ‘‘నాకు ప్రతి సినిమా 10వ తరగతి పరీక్షల లాగా ఉంటుంది. అఖండ-2 ఏం చేస్తుందో తెలియదు. బోయపాటి శ్రీను(Boyapati Srinu) మాములు కసిగా లేరు. అక్కడ ఇంటర్వెల్‌కే డబ్బులు ఇచ్చేయొచ్చు. ‘అఖండ-2’ మాములుగా ఉండదు.. మీరు ముందే ప్రిపేర్ అవ్వండి. సెకండ్ ఆఫ్ ఆడిషనల్ అన్న మాట. ఇప్పటి నుంచే మేము కూడా ప్రిపేర్ అవుతున్నాం. బాలయ్య అంటే మాకు చాలా ప్రేమ, మర్యాద’’ అని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం తమన్ కామెంట్స్ ‘అఖండ-2’ హైప్ పెంచాయి.

Next Story

Most Viewed