Ajith Kumar: సెన్సార్ పూర్తి చేసుకున్న అజిత్ కుమార్ ‘పట్టుదల’ మూవీ.. ఏ సర్టిఫికెట్ వచ్చిందంటే?

by Hamsa |
Ajith Kumar: సెన్సార్ పూర్తి చేసుకున్న అజిత్ కుమార్ ‘పట్టుదల’ మూవీ.. ఏ సర్టిఫికెట్ వచ్చిందంటే?
X

దిశ, సినిమా: కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్(Ajith Kumar), మాగిజ్ తిరుమేని(Magiz Thirumeni) కాంబోలో రాబోతున్న తాజా చిత్రం ‘విదాముయార్చి’(Vidaamuyarchi). ఈ సినిమా తెలుగులో ‘పట్టుదల’(Pattudala) పేరుతో శ్రీ లక్ష్మి బ్యానర్స్‌పై తెరకెక్కుతోంది. అయితే ఇందులో స్టార్ హీరోయిన్ త్రిష(Trisha), అజిత్ సరసన నటిస్తుండగా.. లైకా ప్రొడక్షన్స్(Lyca Productions) బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో సుభాస్కరన్ నిర్మిస్తున్నారు. అయితే ఈ మూవీ పొంగల్‌కు విడుదల కావాల్సి ఉండగా.. పలు కారణాల వల్ల వాయిదా పడింది. దీంతో అజిత్ కుమార్ ఫ్యాన్స్ తీవ్ర నిరాశ చెందారు.

ఈ క్రమంలోనే.. చిత్రబృందం.. ఈ సినిమా ఫిబ్రవరి 6న విడుదల కాబోతున్నట్లు అధికారిక ప్రకటన విడుదల చేశారు. ఇప్పటికే మూవీ మేకర్స్ ప్రమోషన్స్ స్టార్ట్ చేసి వరుస అప్డేట్స్ రిలీజ్ చేస్తూ హైప్ పెంచుతున్నారు. ఇప్పటికే ‘పట్టుదల’ నుంచి విడుదలైన పోస్టర్స్ ప్రేక్షకుల్లో భారీ అంచనాలు పెంచాయి. ఇదిలా ఉంటే.. తాజాగా, మూవీ మేకర్స్ ‘పట్టుదల’ సెన్సార్ పూర్తి చేసుకున్నట్లు అధికారిక ప్రకటన ద్వారా వెల్లడించారు. ఈ సినిమాకు సెన్సార్ వారు UA సర్టిఫికేట్ ఇచ్చినట్లు తెలుపుతూ అజిత్ కుమార్ పోస్టర్‌ను షేర్ చేశారు.

అయితే ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో చిత్రబృందం ప్రమోషన్స్ జోరు పెంచారు. కాగా, అజిత్ కుమార్ వరుస సినిమాలతో ఫుల్ బిజీ బిజీగా గడుపుతున్నారు. ‘విదాముయార్చి’ తో పాటు ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’(Good Bad Ugly) చిత్రంలోనూ నటిస్తున్నారు. షూటింగ్ శరవేగంగా జరుపుకుంటన్న ఈ మూవీ ఏప్రిల్ 10న థియేటర్స్‌లోకి రాబోతుంది. అజిత్ ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే రేసింగ్‌లోనూ పాల్గొంటున్నారు. ఇటీవల ఆయన టీమ్ గెలుచుకున్నారు. అందరి చేత ప్రశంసలు అందుకున్నారు.



Next Story

Most Viewed