Ajaneesh Loknath: ‘రాక్షస’ బోర్డులో అజనీష్ లోకనాథ్.. ఈసారి కూడా మోత మోగిపోద్ది

by sudharani |
Ajaneesh Loknath: ‘రాక్షస’ బోర్డులో అజనీష్ లోకనాథ్.. ఈసారి కూడా మోత మోగిపోద్ది
X

దిశ, సినిమా: కన్నడ డైనమిక్ ప్రిన్స్ ప్రజ్వల్ దేవరాజ్, లోహిత్ హెచ్ కాంబోలో రాబోతున్న తాజా మూవీ ‘రాక్షస’. శివరాత్రి సందర్భంగా ఫిబ్రవరి 26న కన్నడతో పాటు తెలుగులోనూ రిలీజ్ కానుంది. ఎంవీఆర్ కృష్ణ ‘రాక్షస’ తెలుగు రైట్స్‌ను దక్కించుకున్నారు. కంచి కామాక్షి కోల్‌కతా కాళీ క్రియేషన్స్ బ్యానర్‌పై రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు. ఇక ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన తెలుగు ట్రైలర్ రిలీజ్ చేయగా.. ప్రజ్వల్ దేవరాజ్ డిఫరెంట్ లుక్‌లో కనిపించి ఆకట్టుకున్నారు. కూతురుపై ఉన్న ప్రేమతో ఇందులో హీరో చేసిన యాక్షన్ సీన్స్ మూవీపై మరింత క్యూరియాసిటీని పెంచాయి.

ఇదిలా ఉంటే.. తాజాగా ఈ మూవీకి సంబంధించి మ్యూజికల్ అప్‌డేట్ ఇచ్చారు చిత్ర బృందం. ఈ మేరకు ఓ స్పెషల్ వీడియో షేర్ చేస్తూ.. ‘ప్రజ్వల్ దేవరాజ్ ‘రాక్షస’ చిత్రం బోర్డ్‌లో సంగీత దర్శకుడు అజనీష్ లోకనాథ్’ అని తెలియజేశారు. కాగా.. ‘కాంతారా, విరూపాక్ష, మంగళవారం’ వంటి చిత్రాలకు అదిరిపోయే ఆర్ఆర్ ఇచ్చి ప్రేక్షకుల్లో స్పెషల్ క్రేజ్‌ను సొంతం చేసుకున్నాడు. ఇప్పుడు ‘రాక్షస’కు ఈయన సంగీతం అందిస్తున్నాడని తెలియడంతో మూవీపై మరిన్ని అంచనాలు క్రియేట్ అయ్యాయి.



Next Story

Most Viewed