- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
Aishwarya Rajesh: మీరు సౌందర్యను గుర్తుచేశారు అంటూ రిపోర్టర్ కామెంట్.. యంగ్ హీరోయిన్ రియాక్షన్ ఏంటంటే?

దిశ, సినిమా: యంగ్ హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ (Aishwarya Rajesh) రీసెంట్‌గా వచ్చిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాతో ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని సొంతం చేసుకుంది. అనిల్ రావిపూడి(Anil Ravipudi) డైరెక్షన్‌లో వెంకటేష్ (Venkatesh) హీరోగా నటించిన ఈ సినిమా.. ఈ ఏడాది సంక్రాంతి స్పెషల్‌గా వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అందుకోవడంతో.. ఐశ్వర్య పర్ఫామెన్స్‌కు విమర్శకుల ప్రశంసలు అందాయి. ఇక అప్పటి నుంచి ఫుల్ బిజీ అయిపోయిన ఈ బ్యూటీ.. సోషల్ మీడియాలో, షాపింగ్ మాల్స్ ఓపినింగ్స్ అంటూ బ్యాక్ టు బ్యాక్ ప్రేక్షకుల ముందుకు వస్తూ సందడి చేస్తుంది.
ఈ క్రమంలోనే తాజాగా ఓ షాపింగ్ మాల్ ఓపినింగ్(Shopping mall opening)లో సందడి చేసింది ఐశ్వర్య. ఓపినింగ్ అనంతరం మీడియాతో ముచ్చటించింది హీరోయిన్. ఈ మేరకు.. ‘ఇలా మీరు శారీలో కనిపిస్తుంటుంటే ఫ్యామిలీ ఆడియన్స్ మీలో సౌందర్యను చూసుకుంటున్నారు’ అని రిపోర్టర్ కామెంట్ చేస్తాడు. దీనికి ఐశ్వర్య స్పందిస్తూ.. ‘థాంక్యూ.. సౌందర్య గారితో కంపేర్ చేసుకోలేము. ఆమె అంటే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే ఆమె చీర కట్టారు అంటే ఆ చీర తత్వానికే ఒక అందం వస్తుంది.. ఏ ఆడపిల్ల అయిన అలాంటి అందాన్నే కోరుకుంటుంది. చీరకు క్రేజ్ ఎప్పుడు ఉంటుంది’ అంటూ చెప్పుకొచ్చింది.