Pushpa-2 విడుదల నేపథ్యంలో అల్లు అర్జున్ గురించి ఆసక్తికర విషయాలు లీక్..!

by Anjali |   ( Updated:2024-12-04 16:23:24.0  )
Pushpa-2 విడుదల నేపథ్యంలో అల్లు అర్జున్ గురించి ఆసక్తికర విషయాలు లీక్..!
X

దిశ, వెబ్‌డెస్క్: కేవలం ఉత్తరాది, దక్షిణాది మాత్రమే కాదు.. ఖండాంతరాల్లోనూ పుష్ప పేరు దద్దరిల్లిపోతుంది. మరికొన్ని గంటల్లో థియేటర్లన్నీ రప్ప రప్పా అంటూ ఈలలతో మరుమోగిపోవడమే మిగిలి ఉంది. ఇప్పటికే ప్రముఖ దర్శకుడు సుకుమార్(Sukumar) అండ్ అల్లు అర్జున్(Allu Arjun) క్రేజ్ ఓ రేంజ్‌లో పెరిగిపోతుంది. రష్మిక మందన్న(Rashmika Mandanna) కథానాయికగా నటిస్తోన్న ‘పుష్ప-2’ (Pushpa-2)సినిమా వీక్షించేందుకు అడ్వాన్స్ బుకింగ్స్ కూడా చేసుకున్నారు ఫ్యాన్స్. అడ్వాన్స్ బుకింగ్స్‌తోనే ఈ బ్లాక్ బస్టర్ చిత్రం ఏకంగా రూ. 100 కోట్ల గ్రాస్ కలెక్షన్లు వసూలు చేయడం గమనార్హం. విడుదలకు ముందే పుష్ప రెండో భాగం రికార్డుల మీద రికార్డులు కొడుతోంది.

అయితే విడుదల నేపథ్యంలో బన్నీ గురించి ఫ్యాన్స్ సోషల్ మీడియాలో పలు విషయాలు చర్చించుకుంటున్నారు. చైల్డ్ ఆర్టిస్టుగా ఐకాన్‌స్టార్ విజేత(Vijetha), స్వాతిముత్యం(Swatimutyam), డాడీ(daddy) సినిమాల్లో నటించిన విషయం తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) బర్త్డే పార్టీలో అల్లు అర్జున్ వేసిన స్టెప్స్ చూసి స్టార్ దర్శకుడు రాఘవేంద్రరావు(Star director Raghavendra Rao) ఆశ్చర్యపోయాడట. వెంటనే బన్నీ తల్లికి వంద రూపాయలు అడ్వాన్స్ ఇచ్చి.. పెద్దాయ్యాక నీ కొడుకును మంచి హీరోగా తీర్చిదిద్దుతానని చెప్పారట. ఇచ్చిన మాట ప్రకారం ఆయన గంగోత్రి(Gangotri) చిత్రంతో హీరోగా పరిచయం చేశారు. 100 రూపాయలతో కెరీర్ ప్రారంభించిన బన్నీ ఇప్పుడు ఏకంగా ఇప్పుడు రూ. 300 కోట్లు పారితోషికం అందుకోవడం విశేషం అని చెప్పుకోవచ్చు.

Read More...

Allu Arjun: విడుదలకు ముందే కలెక్షన్స్‌లో పుష్ప 2 సరికొత్త రికార్డ్..


Advertisement

Next Story

Most Viewed