శవాలను టచ్ చేస్తూ ఎలా చనిపోయారో చెప్పేస్తున్న వ్యక్తి..

by sudharani |
శవాలను టచ్ చేస్తూ ఎలా చనిపోయారో చెప్పేస్తున్న వ్యక్తి..
X

దిశ, సినిమా: టాలీవుడ్ నటుడు నవదీప్ (Navadeep), కన్నడ హీరో దీక్షిత్ శెట్టి(Dixit Shetty), కోమలి ప్రసాద్(Komali Prasad), పూనచ (Punecha) తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న లేటెస్ట్ వెబ్ సిరీస్ ‘టచ్ మీ నాట్’(Touch Me Not). క్రైమ్ థ్రిల్లర్ బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కిన ఈ సిరీస్‌కు ‘అశ్వత్థామ’ ఫేమ్ డైరెక్టర్ రమణ తేజ తెరకెక్కిస్తున్నారు. ఈ సిరీస్ ఏప్రిల్ 4 నుంచి ప్రముఖ ఓటీటీ సంస్థ జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కాబోతున్నట్లు అనౌన్స్ చేస్తూ.. ట్రైలర్‌ను రిలీజ్ చేశారు మూవీ టీమ్.

‘అందరికీ లైఫ్‌లో కొన్ని సీక్రెట్స్ ఉంటాయి. కానీ, కొన్నిటిని ప్రాణం కన్నా చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. మరి ఈ కేసుని ఎలా డీల్ చేద్దాం అనుకుంటున్నావు.. సైకోమెట్రీ.. అంటే ఏంటీ దేవికా’ అని ఇద్దరు అమ్మాయిల వాయిస్ ఓవర్‌తో స్టార్ట్ అయిన ఈ ట్రైలర్‌ ఆసక్తిని రేకెత్తిస్తోంది. ‘ఈ పిల్లాడు చనిపోయిన వాళ్లను ముట్టుకుని చంపింది ఎవరు అనేది చెప్తాడంట’ అనే డైలాగ్‌తో సైకోమెట్రీ తెలిసిన వ్యక్తిగా దీక్షిత్ శెట్టి ఎంట్రీ ఇస్తాడు. ఇలా ట్రైలర్ మొత్తంలో కొన్ని కేసులు, క్రైమ్ యాక్షన్ సీన్స్, సస్పెన్స్ ఇంట్రెస్టింగ్‌గా అనిపిస్తున్నాయి. ఇక ‘ఈ గేమ్ ఎండ్ అవ్వాలంటే మనిద్దరిలో ఎవరో ఒకరి లైఫ్ ఎండ్ అవ్వాలి’ అనే డైలాగ్‌తో ముగిసిన ఈ ట్రైలర్ ‘టచ్ మీ నాట్’ సిరీస్‌పై క్యూరియాసిటీని పెంచుతోంది.

Next Story

Most Viewed