- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
కొంచెం జ్ఞానం ఉంటే ఆ తేడా కనిపిస్తుంది ప్రతి ఒక్కరు ఆ పని చేయాలంటూ రాజమౌళి పోస్ట్.. ఎవరిని ఉద్దేశించంటే?

దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రాజమౌళి (rajamouli), సూపర్ స్టార్ మహేష్ బాబు(mahesh babu) కాంబినేషన్‌లో రాబోతున్న లేటెస్ట్ మూవీ ‘SSMB29’. ఇందులో బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా (priyanka chopra) హీరోయిన్‌గా నటిస్తోంది. అయితే షూటింగ్ కోసం రాజమౌళి ఇన్నాళ్లు పలు ప్రదేశాలు చూసి వచ్చారు. ఇక ఇటీవల మొదటి షెడ్యూల్‌ను ఓడిశాలోని కోరాపుట్ జిల్లాలో షూటింగ్ చేసినట్లు సమాచారం. ‘SSMB29’ సినిమా కోసం మహేష్ బాబు కూడా చాలా కష్టపడుతున్నారు. గత కొద్ది కాలం నుంచి ఆయన సోషల్ మీడియాకు కూడా దూరం అయ్యారు. అయితే ఈ మూవీపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఏదో ఒక చిన్న అప్డేట్ అయినా ఇస్తారని సూపర్ స్టార్ ఫ్యాన్స్ వేయి కళ్లతో వేయిట్ చేస్తున్నారు.
అయినప్పటికీ రాజమౌళి మాత్రం ఎలాంటి అప్డేట్ ఇవ్వడం లేదు. ఇదిలా ఉంటే.. తాజాగా, రాజమౌళి ఇన్‌స్టా ద్వారా ఓ ఆసక్తికర పోస్ట్ పెట్టారు. ‘‘ఒడిశాలోని అత్యంత ఎత్తైన, అద్భుతమైన శిఖరం అయిన డియోమాలికి అద్భుతమైన సోలో ట్రెక్కింగ్ చేశాను. పై నుండి చూస్తే దృశ్యం చాలా అద్భుతంగా ఉంది. కానీ ఆ దారి అంతా చెత్తతో ఉండటం నిరాశపరిచింది. ఇలాంటి సహజమైన అద్భుతాలకు ఇంకా మంచి అర్హత ఉంది. మనకు కొంచెం జ్ఞానం ఉంటే ఆ తేడా కనిపిస్తుంది. ఈ ప్రదేశాలను రక్షించడానికి ఇక్కడికి వచ్చే ప్రతి ఒక్కరు తమ చెత్తని పారేయకుండా తిరిగి తీసుకెళ్లాలి’’ అని రాసుకొచ్చారు. అలాగే ట్రెక్కింగ్ చేసిన వీడియోను షేర్ చేశారు. ఇక ఈ పోస్ట్ చూసిన అభిమానులు ఖుషీ అవుతూ జై మహేష్ బాబు అని కామెంట్స్ చేస్తున్నారు.
Read More..
గెట్ రెడీ బాయ్స్.. ‘రెట్రో నుంచి బిగ్ అప్డేట్ వచ్చేస్తుందంటూ డైరెక్టర్ ఇంట్రెస్టింగ్ ట్వీట్
Telugu News, Latest Telugu News, Latest News in Telugu