Sanjay Dutt: సంజయ్ దత్ పేరుపై ఏకంగా రూ.72 కోట్ల ఆస్తులు రాసిన అభిమాని.. ఆయన రియాక్షన్ ఇదే! (పోస్ట్)

by Hamsa |
Sanjay Dutt: సంజయ్ దత్ పేరుపై ఏకంగా రూ.72 కోట్ల ఆస్తులు రాసిన అభిమాని.. ఆయన రియాక్షన్ ఇదే! (పోస్ట్)
X

దిశ, సినిమా: చాలామంది సినీ సెలబ్రిటీలపై తమ పిచ్చి ప్రేమను చూపిస్తూ అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంటారు. కొంతమంది తమ అభిమాన హీరో పుట్టినరోజుకు రక్త దానం చేస్తుంటారు. మరికొందరైతే ఏకంగా ప్రాణాలు ఇవ్వడానికి కూడా వెనకాడరు అనడంతో అతిశయోక్తి లేదు. ఇక స్టార్ హీరోల సినిమాలు రిలీజ్ కాబోతున్నాయంటే థియేటర్స్‌లో అభిమానులు చేసే రచ్చ అంతా ఇంతా కాదు. అయితే ఇటీవల కొంతమంది ఏకంగా థియేటర్స్ వద్ద బాణాసంచాతో పాటు జంతు బలి కూడా ఇస్తున్నారు. ఇటీవల ఇలాంటి సంఘటనలు ఎన్నో జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే అభిమానుల పిచ్చి ప్రేమకు అంతు ఉండటం లేదు.

ఇదిలా ఉంటే.. తాజాగా, ఓ వీరాభిమాని నిషా పాటిల్(Nisha Patil) చనిపోయే ముందు తన ఆస్తులను బాలీవుడ్ నటుడు సంజయ్ దత్(Sanjay Dutt) పేరుపై ఏకంగా 72 కోట్లు రాసినట్లు సమాచారం. ఇక ఈ విషయం సంజయ్ దత్‌కు తెలియగా ఆయన దానిని తిరస్కరించారు. అయితే నిషా పాటిల్‌తో తనకు పరిచయం లేదని, రూ.72 కోట్ల ఆస్తిని క్లెయిమ్ చేసే ఆలోచనే లేదని సంజయ్ దత్ తరపు న్యాయవాది స్పష్టం చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ అందరినీ షాక్‌కు గురి చేస్తోంది.

ఇక ఈ విషయం తెలుసుకున్న వారంతా వావ్ మాకు ఇచ్చినా బాగుండు అని అనుకుంటున్నారు. కాగా, సంజయ్ దత్ సినిమాల విషయానికొస్తే.. ఆయన లియో, కేజీఎఫ్-2 వంటి చిత్రాల్లో విలన్‌గా నటించి ఫుల్ పాపులారిటీ తెచ్చుకున్నారు. అలాగే తెలుగు చిత్రాల్లో నటించిన ఆయన అందరినీ తన నటనతో ఫిదా చేశారు. ప్రస్తుతం ‘భాగీ-4’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. షూటింగ్ శరవేగంగా జరుగుతున్న ఈ సినిమా సెప్టెంబర్ 5న విడుదల కాబోతుంది.

Next Story