- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
నైవేద్యంగా సిగరెట్..మీకు తెలుసా?
దిశ, వెబ్ డెస్క్: మనదేశంలో ప్రాంతాన్ని బట్టి సంప్రదాయాలు, ఆచారాలు, నమ్మకాలు మారుతూ ఉంటాయి. అఘోరాలను కూడా కొందరు భక్తులు నమ్ముతారు. వారిని పూజిస్తారు. గుజరాత్‌లోని సబర్మతి నది ఒడ్డున ఉన్న ‘దధీచి’ అశ్రమ అఘోరాల వద్దకు భక్తులు లాక్‌డౌన్‌లో పోటెత్తారు. అయితే, ఇక్కడ ఓ విశేషమైన సంప్రదాయం ఉంది. అదేంటంటే..ధూపదీప నైవేద్యాలకు బదులుగా భక్తులు సిగరెట్ వెలిగిస్తారు.
ఒక్కో దేవుడికి ఒక్కోరకం ప్రసాదం నివేదించుకుంటారు. అలాగే మొక్కుల్లోనూ తేడా ఉంటుంది. అలా తమ కోరికలను నెరవేర్చుకోవాలంటే ప్రతి గురువారం ఆశ్రమంలో ఉన్న ‘అఘోరీ దాదా’ ఎదుట సిగరెట్లు వెలిగిస్తారు. అలాగే రోజా పూలు సమర్పిస్తారు. ‘సిగరెట్లు’ వెలగించాలనే వింత సంప్రదాయానికి కూడా ఓ ప్రత్యేకత ఉంది. అదేంటంటే ఆ సిగరెట్లు కూడా ఖరీదైనవి కావు. కేవలం తక్కువ ధరవి మాత్రమే నివేదించాలి. ఈ సంప్రదాయం అహ్మదాబాద్ నగరం పుట్టకముందు నుంచే ఉందని ఆశ్రమ ట్రస్టీలు తెలిపారు. భగవద్గీతలోనూ ఈ ఆశ్రమ ప్రస్థావన ఉంటుందని ట్రస్టీ తెలిపింది. అఘోరీ దాదా వద్ద గతంలో చరస్, గంజాయి లాంటి వాటిని కూడా ‘ప్రసాదం’గా సమర్పించేవారు. కానీ, అవి చట్ట విరుద్ధం కావడంతో వాటిని నిలిపివేశారు ట్రస్టీలు. సమాధి ఎదురుగా ఉండే ఓ టేబుల్ మీద సిగరెట్లను వెలిగించి పెడతారు భక్తులు.