‘నకిలీ’ కోసం సీఐడీ స్పీడప్

by  |
‘నకిలీ’ కోసం సీఐడీ స్పీడప్
X

దిశ, వెబ్‌డెస్క్: సీఎంఆర్ఎఫ్ నకిలీ చెక్కుల వ్యవహారం పై సీఐడీ అధికారులు దర్యాప్తు వేగవంతం చేశారు. సీఎం రిలీఫ్ పండ్ ద్వారా ఏప్రిల్ నుంచి 16 వేల చెక్కులను.. బాధితులకు పంపిణీ చేసినట్టు రెవెన్యూ శాఖ అధికారులు తెలిపారు. అందులో 970 చెక్కులు మాత్రమే రూ. లక్ష కన్నా ఎక్కువ మొత్తం మీద జారీ చేసినట్టు సీఎంఆర్‌ఎఫ్‌ స్పష్టం చేసింది. మిగిలిన చెక్కులన్ని రూ. లక్ష లోపు మాత్రమేనని వెల్లడించింది. దీంతో నకిలీ చెక్కుల పై నెంబర్లను ఈ చెక్కులతో సరిపోల్చి సీఐడీ విచారిస్తుంది. 2019లో సీఎంఆర్ఎఫ్ జారీ చేసిన మరో చెక్కును.. ఇప్పటి వరకు ఖాతాలో జమ చేయలేదని సీఐడీ గుర్తించినట్టు తెలుస్తోంది. సీఎంఆర్‌ఎఫ్ ద్వారా ఆర్థిక సాయం అందించే ప్రభుత్వ ఖాతాలో.. రూ. 90 కోట్లు మాత్రమే నిధులు ఉన్నట్టు సమాచారం.


Next Story