- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అమరావతి బకాసురులు.. చంద్రబాబు మెడకు ఉచ్చు బిగుస్తోందా ?
దిశ,వెబ్‌డెస్క్: అమరావతి భూకుంభకోణం వ్యవహారంలో మాజీ సీఎం చందబాబుకు ఉచ్చుబిగుస్తోందా? అంటే అవుననే అంటున్నాయి తాజా పరిణామాలు.
అమరావతిలో 500ఎకరాల భూకుంభకోణంపై ఈరోజు ఉదయం 8గంటల ప్రాంతంలో రెండు బృందాలుగా హైదరాబాద్ కు వచ్చిన ఏపీ సీఐడీ అధికారులు.., మాజీ సీఎం చంద్రబాబుకు నోటీసులు జారీ చేశారు. చంద్రబాబుతో పాటు, మాజీ మంత్రి నారాయణ, అప్పటి గుంటూరు కలెక్టర్ కాంతిలాద్ దండేకు 160సీఆర్పీసీ నోటీసులు జారీ చేశారు.
ప్రస్తుతం అధికార పార్టీ వైసీపీ ఏర్పాటు చేసిన మంత్రుల హైపవర్ కమిటీ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం.., రాజధాని భూముల్లో జరిగిన అక్రమాలు అన్నీ ఇన్నీకావు. దళితులు, నిరుపేదలు దారుణంగా మోసపోయారు. దాదాపూ 47.39 ఎకరాల భూముల్ని కొల్లి శివరామ్ అనే వ్యక్తికి ఇచ్చారంటూ రిపోర్ట్ లో పేర్కొన్నారు. ఇలా శివరామ్ తో పాటూ ఎవరికి! ఎన్ని ఎకరాల భూముల్ని కట్టబెట్టారనే విషయాల్ని స్పష్టం చేస్తూ ఓ రిపోర్ట్ ను తయారు చేసినట్లు సమాచారం. ఆ రిపోర్ట్ ఆధారంగా చంద్రబాబుకు సీఐడీ నోటీసులు జారీ చేశారు.