Police: సీఎం బందోబస్త్ కన్నా… ఈ తల్లి ప్రాణం మిన్న

by Shyam |   ( Updated:21 May 2021 3:07 AM  )
Police: సీఎం బందోబస్త్ కన్నా… ఈ తల్లి ప్రాణం మిన్న
X

దిశ, పోచమ్మమైదాన్ : సీఎం వస్తున్నాడంటే ఆ హడావిడి వేరు. ముఖ్యంగా బందోబస్తు విషయంలో పోలీసులు ఎంతో పకడ్బందీగా ఉంటారు. ఇక చుట్టుపక్కల ఉన్నవాళ్లను పట్టించుకోవడానికి కూడా వారికి తీరిక ఉండదు. కానీ ఓ సీఐ సీఎం బందోబస్త్ లో భాగంగా విధులు నిర్వహిస్తూ మానవత్వం చాటుకున్నాడు. నడవలేని స్థితిలో ఉన్న ఓ వృద్ధురాలికి కన్న కొడుకులా సహాయం అందించారు. వివరాల ప్రకారం.. విధులు నిర్వహిస్తున్న ఓ సీఐ మానవత్వాన్ని చాటుకున్నారు సీఎం బందోబస్త్ లో భాగం గా ఎంజీఎం దవాఖాన వద్ద విధులు నిర్వహిస్తుండగా ఒక వృద్దురాలు అనారోగ్యంతో అవస్థపడుతూ ఉంది. అందుబాటులో ఎలాంటి వాహనం లేకపోవడంతో కరోనా ని కూడా లెక్కచేయకుండా అ వృద్దురాలిని తన చేతులతో ఆటో వున్న స్థలం వద్దకు ఎత్తుకొని పోయి చికిత్స నిమిత్తం దవాఖాన కి పంపించారు. అ దృశ్యాన్ని చూసిన పరకాల ఏసీపీ శ్రీనివాస్, పోలీస్ సిబ్బంది సీఐ చేసిన పనిపట్ల హర్షం వ్యక్తం చేశారు.

Advertisement

Next Story

Most Viewed