సైదులు ఫేస్‌బుక్ అకౌంట్ హాక్

by Sumithra |
సైదులు ఫేస్‌బుక్ అకౌంట్ హాక్
X

దిశ, వెబ్‌డెస్క్: రోజురోజుకూ సైబర్ నేరగాళ్ల బెడద ఎక్కువైపోతున్న విషయం తెలిసిందే. అమాయకులు, రాజకీయ నాయకులనే కాకుండా ఈ మధ్య ఏకంగా పోలీసులను కూడా బురిడీ కొట్టిస్తున్నారు. తాజాగా ఎన్‌ఆర్‌నగర్‌ సర్కిల్ ఇన్స్‌పెక్టర్ సైదులు ఫేస్‌బుక్‌ ఖాతాను హాక్‌ చేశారు. అంతేగాకుండా ఆయన పేరుతో ఫేస్‌బుక్‌ ఫ్రెండ్ జాబితాలో ఉన్న వారందరినీ డబ్బులు పంపాలని మెసెంజర్‌లో హ్యాకర్లు కోరారు. ఈ సమాచారంతో విషయం తెలుసుకున్న సీఐ సైదులు సైబర్‌ పోలీసులుకు సమాచారం అందించారు. తన అకౌంట్ నుంచి ఎవరు డబ్బులు పంపించాలని కోరినా పంపవద్దని కోరారు. ప్రస్తుతం కేసు నమోదు చేసుకున్న పోలీసులు సైబర్‌ పోలీసులు నిందితులను పట్టుకునే పనిలో ఉన్నారు.

Advertisement

Next Story

Most Viewed