- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సీరియల్ నటుడు సమీర్ కేసులో సీఐ క్లారిటీ
X
దిశ, వెబ్‌డెస్క్: అసభ్య పదజాలంతో దూషిస్తూ, లైంగికంగా వేధింపులకు పాల్పడ్డాడని కోయిలమ్మ సీరియల్ నటుడు సమీర్ అలియాస్ అమర్‌పై రాయదుర్గం పీఎస్‌లో ఓ మహిళ ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. సీఐ రవీందర్ తెలిపిన వివరాల ప్రకారం.. మణికొండలో శ్రీవిద్య, స్వాతి, లక్ష్మీ కలిసి బోటిక్ వ్యాపారం నిర్వహిస్తున్నారని చెప్పారు. కొన్ని కారణాల వల్ల స్వాతి బోటిక్ వ్యాపారం నుంచి తప్పుకుందన్నారు. అయితే, స్వాతికి రావాల్సిన కొన్ని వస్తువులు శ్రీవిద్య ఇవ్వకపోవడంతో.. గత రాత్రి కోయిలమ్మ సీరియల్ హీరో సమీర్ అలియాస్ అమర్‌తో కలిసి ఆమె ఇంటికి వెళ్లారని తెలిపారు. ఈ క్రమంలో ఇరువురి వాదనలు గొడవకు దారి తీసిందన్నారు. ఈ నేపథ్యంలోనే ఒకరిపై మరొకరు ఫిర్యాదు చేసుకున్నారని సీఐ రవీందర్ క్లారిటీ ఇచ్చారు. దీంతో కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టామని తెలిపారు.
Advertisement
Next Story