కరోనా నిబంధనలు పాటించాల్సిందే.. సీఐ రాజిరెడ్డి సూచన

by Shyam |
CI Raji Reddy
X

దిశ, కొత్తగూడ: దేశంలో కొవిడ్‌ కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ కేసులు బయటపడుతోన్న నేపథ్యంలో మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ, గంగారం మండల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని గూడూరు సీఐ రాజిరెడ్డి సూచించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ… మహమ్మారి పట్ల అందరూ జాగ్రత్తగా ఉండాలని, బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు తప్పనిసరిగా ధరలించాలని, లేకపోతే ఫైన్ విధిస్తామని హెచ్చరించారు. రాష్ట్రంలో ఒమిక్రాన్ కేసులు రాకుండా ప్రభుత్వం గట్టి చర్యలు చేపడుతోందని తెలిపారు. ఇందులో భాగంగా తమవంతు బాధ్యతగా అందరూ మాస్కు ధరించాలని, భౌతికదూరం పాటించాలని, లేకపోతే రూ.1000 జరిమానా విధిస్తామని స్పష్టం చేశారు. జనసాంద్రత కలిగిన ప్రదేశాలు, ప్రజా రవాణా, వ్యాపార సముదాయాలు, కార్యాలయాల్లో కరోనా నిబంధనలు కచ్చితంగా పాటించాలని సూచించారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారికి ఫైన్ వేయడంతో కేసులు కూడా నమోదు చేస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో కొత్తగూడ, గంగారం ఎస్ఐలు నాగేష్, ఉపేందర్‌లు, పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed