ఇకపై హీరోగా జానీ మాస్టర్..

by Jakkula Samataha |   ( Updated:28 Dec 2020 9:04 AM  )
ఇకపై హీరోగా జానీ మాస్టర్..
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నారు. మురళిరాజ్ తియ్యన డైరెక్షన్‌లో వస్తున్న సినిమాను సుజి విజువల్స్ నిర్మిస్తుండగా.. రామానాయుడు స్టూడియోస్‌లో ఘనంగా లాంచ్ అయింది. డైరెక్టర్ వీవీ వినాయక్, నాగబాబు, నిర్మాత లగడపాటి శ్రీధర్, యాంకర్ ప్రదీప్ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. తనను ఆశీర్వదించేందుకు వచ్చిన అతిథులందరికీ జానీ మాస్టర్ కృతజ్ఞతలు తెలిపారు.

తనకు కొరియోగ్రఫీ, డైరెక్షన్ మీద మాత్రమే ఇంట్రెస్ట్ ఉండేదని.. కానీ డైరెక్టర్ కథ చెప్పాక తప్పకుండా నటించాలని నిర్ణయించుకున్నట్లు చెప్పాడు. తను చేయకపోతే సినిమానే చేయనని నిర్మాత వెంకటరమణ చెప్పడంతో మరింత కనెక్ట్ అయినట్లు తెలిపాడు. తనతో జోడీ కట్టేందుకు ముందుకొచ్చిన హీరోయిన్ దిగంగనా సూర్యవంశీకి థాంక్స్ చెప్పాడు జానీ. రధన్ మ్యూజిక్ అందిస్తున్న సినిమా ప్రీలుక్‌లో జానీ మాస్టర్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌లా కనిపిస్తూ అదరగొట్టాడు.
https://twitter.com/AlwaysJani/status/1343527094278475776?s=20



Next Story

Most Viewed