ఎయిర్ ఇండియాపై ఉన్నది ఆ రెండు ఆప్షన్లు మాత్రమే

by Shamantha N |
ఎయిర్ ఇండియాపై ఉన్నది ఆ రెండు ఆప్షన్లు మాత్రమే
X

న్యూఢిల్లీ: ప్రభుత్వ విమానయాన సంస్థలో 100శాతం పెట్టుబడులను ఉపసంహరిస్తామని కేంద్రం స్పష్టం చేసింది. ప్రస్తుతం పెట్టుబడులను ఉపసంహరించడమా? వద్దా? అనే ఆప్షన్లు లేవని అన్నారు. సంస్థను మూసేయడమా? లేక డిజిన్వెస్ట్‌మెంట్ చేయడమా?, ఇవి రెండే మార్గాలు ముందున్నాయని తెలిపారు. ప్రభుత్వ సంస్థల్లో ఎయిర్ ఇండియా మెరుగైనదని, కానీ, దానికి రూ. 60వేల కోట్ల అప్పులున్నాయని వివరించారు. ఈ చిట్టాను శూన్యానికి తీసుకురావాలంటే పెట్టుబడుల ఉపసంహరణ చేయకతప్పడం లేదని అన్నారు. సోమవారం జరిగిన సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నామని, ఎయిర్ ఇండియా పెట్టుబడుల ఉపసంహరణకు బిడ్ చేసేవారికి 64 రోజుల్లో బిడ్డింగ్ నిర్వహించనున్నట్టు తెలియజేయాలని నిర్ణయించినట్టు చెప్పారు. ఈ సారి ప్రభుత్వం స్పష్టంగా నిర్ణయం తీసుకుందని, ఈ ప్రక్రియలో సంశయాలకు తావులేదని వివరించారు. ఎయిర్ ఇండియాలో 76శాతం వాటాలు, మేనేజ్‌మెంట్ కంట్రోల్ కోసం ఎక్స్‌ప్రెషన్ ఆఫ్ ఇంటరెస్ట్‌ను 2018లో ప్రభుత్వం ప్రకటించింది. కానీ, సింగిల్ బిడ్డర్ కూడా రాలేదు. ప్రస్తుతం ఎయిర్ ఇండియాలో కేంద్రానికి 100శాతం ఈక్విటీ ఉన్నది.

Advertisement

Next Story