సోషల్ మీడియా పోస్టుపై చిరుమామిళ్ల కృష్ణ అరెస్టు

by srinivas |
సోషల్ మీడియా పోస్టుపై చిరుమామిళ్ల కృష్ణ అరెస్టు
X

దిశ, ఏపీ బ్యూరో: సోషల్ మీడియాలో ప్రభుత్వానికి వ్యతిరేక పోస్టులు పెట్టాడని ఆరోపిస్తూ ఏపీ సీఐడీ అధికారులు కృష్ణా జిల్లా నందిగామలో టీడీపీ కార్యకర్త చిరుమామిళ్ల కృష్ణను గత అర్ధరాత్రి అదుపులోకి తీసుకున్నారు. వైజాగ్‌లో టీడీపీ నేత గంటా శ్రీనివాసరావు సన్నిహితుడైన నలంద కిషోర్‌ను ఈ వేకువ జామున అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. వీరిద్దర్నీ ఒకే కారణంతో అదుపులోకి తీసుకున్నారు. ప్రభుత్వ వ్యతిరేక విధానాలను విమర్శించారన్న కారణంతో వారిని సీఐడీ అధికారులు అరెస్టు చేశారు. దీనిపై సోషల్ మీడియాలో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. ప్రభుత్వం ఎందుకు భయపడుతోందని నెటిజన్లు విమర్శిస్తున్నారు.

Advertisement

Next Story