- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
జగన్‌కు ‘చిరు’ ధన్యవాదాలు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డికి మెగాస్టార్ చిరంజీవి కృతజ్ఞతలు తెలిపారు. లాక్‌డౌన్‌తో ఇబ్బందుల్లో ఉన్న సినీ పరిశ్రమకు మేలు కలిగే నిర్ణయాలతో పాటు సింగిల్ విండో అనుమతులకు జీవో జారీ చేసినందుకు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ మేరకు ఈరోజు (ఆదివారం) సీఎం జగన్‌తో చిరు ఫోన్‌లో మాట్లాడారు. కాగా లాక్‌డౌన్ ముగిసిన తర్వాత సినీ పరిశ్రమ సమస్యలపై చర్చించేందుకు కలుద్దామని సీఎం జగన్ చెప్పారని, అన్ని విభాగాల ప్రతినిధులతో త్వరలోనే ముఖ్యమంత్రిని కలుస్తామంటూ చిరంజీవి ట్విటర్ వేదికగా ప్రకటించారు.
ఇదిలా ఉంటే.. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌తోనూ శనివారం టాలీవుడ్ ప్రముఖులు చర్చించిన విషయం తెలిసిందే. లాక్‌డౌన్ కారణంగా నిలిచిపోయిన షూటింగ్స్‌ను కొనసాగించే విధంగా అనుమతులు ఇవ్వాలని ఈ సందర్భంగా ఆయనను కోరారు. దీనికి స్పందించిన కేసీఆర్ జూన్‌లో సినిమా షూటింగ్స్ ప్రారంభించుకోవచ్చని చెప్పారు. కరోనా తీవ్రతను బట్టి సినిమా థియేటర్లు తిరిగి ప్రారంభించే విషయంపై నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా త్వరలోనే షూటింగ్స్, సినిమా హాళ్ల ఓపెనింగ్‌పై క్లారిటీ ఇస్తామని వెల్లడించారు.