- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
అమ్మ రెసిపీ పరిచయం చేసిన చిరు
మెగాస్టార్ చిరంజీవికి తల్లి అంటే ప్రాణం. తమను చిన్నప్పుడు అమ్మ ఎంత ప్రాణంగా పెంచిందో, ఇప్పుడు అంతే అపురూపంగా అమ్మను చూసుకుంటున్నారు. అమ్మ ఆశీర్వాదంతోనే అన్ని పనులకు శ్రీకారం చుట్టే చిరు.. లాక్‌డౌన్‌లో అమ్మ అంజనాదేవితో ఆనందంగా గడిపారు. ఈ టైమ్‌లో ఎన్నో వీడియోలు చేసిన చిరు.. అమ్మను కూడా అందులో భాగస్వామిని చేశారు. ఈ లాక్‌డౌన్‌లోనే మనవడు రామ్ చరణ్ తేజ్‌కు స్వచ్చమైన వెన్నె ఎలా తీయాలో నేర్పడంతో పాటు ఆవకాయ ఎలా పెట్టాలో కూడా అంజనాదేవి చిట్కాలు చెప్పిన విషయం తెలిసిందే.
అయితే చిరు ఇప్పుడు తల్లికి ఓ సర్‌ప్రైజ్ ఇచ్చాడు. ‘బి ద రియల్ మెన్’ చాలెంజ్‌లో భాగంగా తల్లికి దోశ వేసి అందించిన చిరు.. చిన్నప్పుడు తల్లి నేర్పిన వంటకాన్ని ఇప్పుడు చేసి ఆనాటి మధుర రుచిని తల్లికి మరోసారి పరిచయం చేశారు. తన చేతులతోనే స్వయంగా చింతకాయలతో చేపల వేపుడు చేసి తినిపించారు. దీనికి అంజనా దేవి 100కు 100 మార్కులు వేయగా.. బ్లాక్ బస్టర్ హిట్ కొట్టినంత హ్యాపీగా ఫీల్ అయ్యారు చిరు.
చాలా తక్కువ ఖర్చుతో కూడిన ఈ చేపల వేపుడు రెసిపీ.. అన్ని వర్గాల వారు చేసుకునే విధంగా ఉండగా, చిరు వంట అమేజింగ్ అంటున్నారు నెటిజన్లు. బాస్ ఏది చేసినా బ్లాక్ బాస్టరే అని సంబరపడుతున్నారు.