- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
క్లాసికల్ హిట్.. అగ్రతాంబూలం దర్శకుడికే ఇచ్చిన చిరు
జగదేకవీరుడు అతిలోకసుందరి…తెలుగు సినీ చరిత్రలో ఎవర్ గ్రీన్ క్లాసికల్ హిట్. అందమైన దేవకన్యను ఉంగరం కోసం భూలోకానికి రప్పించి.. మానవా మానవా అంటూ మానవునితో ప్రేమలో పడేలా చేసి.. దేవలోకం కన్నా భూలోకమే బహుబాగుంది అని చెప్పించాడు దర్శకేంద్రుడు. దృష్ట మాంత్రికుడి మాయాజాలం.. దేవకన్య అందాలు.. మానవుడి సాహసంతో ప్రేక్షకులను ఫిదా చేసిన ఈ అందమైన చందమామ కథ విడుదలై 30 ఏళ్లు పూర్తి అయిన సందర్భంగా సినిమాతో అనుబంధం గురించి పంచుకున్నారు కథానాయకుడు చిరంజీవి.
When audiences brave cyclones & flock to theaters
it shows
how much they loved a movie.Moments,any artist & film maker dreams of & lives for. Humbled by all da love
#30GloriousYrsForIHJVAS #TimeLessCinema @VyjayanthiFilms @Ragavendraraoba #ilaiyaraaja https://t.co/OPPedDVUyY— Chiranjeevi Konidela (@KChiruTweets) May 9, 2020
అగ్రతాంబూలం దర్శకేంద్రుడికే..
తెలుగు సినీ చరిత్ర లో ఆణిముత్యం గా నిలిచిపోయిన ఈ చిత్రానికి జనరేషన్ గ్యాప్ అనేదే లేదన్నాడు చిరు. ఎప్పుడూ సినిమా చూసిన చాలా ఫ్రెష్ ఫీలింగ్ కలుగుతుందని చెప్పాడు. అయితే ఈ సినిమా విజయంలో అగ్రతాంబూలం దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు కే దక్కుతుందని తెలిపారు. స్టోరీ లైన్ విన్నప్పటి నుంచి కథకు కార్యరూపం దాల్చి సినిమాను తెరమీదికి తెచ్చేంత వరకు ఆయన పడిన కష్టానికి ప్రతిఫలం ఈ అద్భుత చిత్రమన్నారు. సినిమాను ఒక శిల్పి మాదిరి ఆద్యంతం అద్భుతంగా చెక్కినట్లు తెలిపారు. ఈ రోజు చందమామ కథలు ఎవరు చుస్తా రన్న వారికి ఒక చెంప పెట్టులా సినిమాను తెరకెక్కించి.. తన సత్తా చాటారని తెలిపారు చిరు. ఈ సినిమాకు దృష్ట మాంత్రికుడు అమ్రిష్ పురి అయితే.. చిత్ర సృష్టి మాంత్రికుడు మా రాఘవేంద్ర రావు అని చెప్పాడు.
అతిలోకసుందరి లేకపోతే సినిమా లేదు..
అందాల తార శ్రీదేవి లేకపోతే సినిమా లేదని చెప్పారు చిరు. ఈ సినిమా కథ, అతిలోక సుందరి పాత్ర శ్రీదేవి కోసమే పుట్టాయని అభిప్రాయపడ్డారు. ఆమె అందచందాలు, హొయలు, చిలుక పలుకులు, అమాయకపు చూపులతో నిజంగా దేవకన్య దిగొచ్చినట్లు ఉండేదని … ఆ పాత్రలో జీవించిందని చెప్పారు. తన అందాలతో ప్రేక్షకులను తినేసేదని.. తొలిసారి ఒక యాక్టర్ తో నటించేందుకు, తనను మ్యాచ్ చేసేందుకు శ్రమ పడాల్సి వచ్చిందంటే అది శ్రీదేవితో మాత్రమే అన్నారు చిరు.
సినిమా కోసం పరితపించే నిర్మాత
అశ్వినీదత్.. గొప్ప అభిరుచి, భారీతనం ఉన్న నిర్మాత. చిత్రం కోసం పరితపించే వ్యక్తి. ఎంత క్యాష్ మిగిలింది కాదు.. ఎంత కీర్తి దక్కిందని చూసే నిర్మాత అన్నారు చిరు. ఈ సినిమాకు నన్ను జగదేకవీరుడు గా ఎంచుకున్న అశ్వనీదత్ కు రుణపడి ఉంటా అని తెలిపారు చిరు.
వేటూరి సాహిత్యం అజరామరం
సినిమాకు వేటూరి అందించిన సాహిత్యం అజరారం అన్నారు చిరంజీవి. సాహిత్య పరంగా ఒక్కో పాట ఒక్కో అద్భుతం అని కొనియాడారు. అహో మహోదయం అంటూ కశ్మీర్ అందాలను వర్ణించినా… ప్రియతమా అంటూ ప్రియుడు,ప్రియురాలి వేదనను తెలిపినా.. అబ్బనీ తియ్యని దెబ్బ అంటూ మాస్ సాంగ్ లిరిక్స్ ఇచ్చినా వేటూరికి చెల్లిందంటూ ప్రశంసించారు.
విన్సెంట్ ఫోటోగ్రఫీ అద్భుతం
VFX లేని రోజుల్లో ప్రేక్షకులను తన ఫోటోగ్రఫీ తో అబ్బురపరిచే ప్రతిభ విన్సెంట్ సొంతమని చెప్పారు చిరు. దేవకన్య దిగివచ్చిన విజువల్స్ మెస్మరైజు చేయగా.. ఇండోర్ లో తీసిన సీన్స్ మంచుకొండల్లో ఉన్నట్లు చేయడం ఆ రోజుల్లో నిజంగా అద్భుతం అన్నారు.