ఎస్‌ఐని అరెస్ట్ చేసిన పోలీసులు

దిశ, వెబ్ డెస్క్: దళిత యువకుడి మృతి కేసులో చీరాల టూటౌన్ ఎస్సై విజయ్ కుమార్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. జూన్ 18న మాస్క్ పెట్టుకోలేదని కిరణ్ కుమార్ అనే యువకుడిని చితకబాదారు. అతను గుంటూరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై గుంటూరు అడిషనల్ ఎస్పీ గంగాధర్ విచారణ చేపట్టారు.

ప్రకాశం జిల్లా వేటపాలెం మండలం కొత్తపేట చెక్ పోస్ట్ వద్ద బైక్ వస్తున్న కిరణ్ కుమార్, అబ్రహాం షనీ అనే యువకులను పోలీసులు అపారు. మాస్క్ ఎందుకు పెట్టుకోలేదని వారిని నిలదీశారు. మాటమాట పెరిగి వారి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో ఇద్దరి యువకులను ఎస్‌ఐ విజయ్ కుమార్ చితకబాదారు. దీంతో కిరణ్ కుమార్ గుంటూరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశాడు. కాగా, ఈ కేసులో ఇప్పటికే ఎస్‌ఐ విజయకుమార్ సస్పెండ్ అయిన సంగతి తెలిసిందే.

Advertisement