- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
చింతా ప్రభాకర్ పార్టీకి దూరం.. మంత్రి హరీష్‌రావు బుజ్జగింపులు
దిశ ప్రతినిధి, సంగారెడ్డి: అలిగి కార్యక్రమాలకు దూరంగా ఉన్న సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్‌ను మంత్రి హరీష్‌రావు బుజ్జగించారు. చింతా ప్రభాకర్ పార్టీ మారే యోచనలో ఉన్నట్లు ‘దిశ’లో వచ్చిన కథనం రాజకీయ వర్గాల్లో సంచలనం సృష్టించింది. పార్టీ వర్కింగ్ కల్వకుంట్ల తారకరావు సంగారెడ్డి పర్యటన, చింతా ప్రభాకర్ అలకకు కారణమైన విషయం తెలిసిందే. తనతో పాటు పార్టీ శ్రేణుల ముందే మంత్రి కేటీఆర్ జగ్గారెడ్డిని పొగడడం, మా ఎంపీ, ఎమ్మెల్యేలను బాగా చూసుకో.. జగ్గన్న అనడాన్ని ప్రభాకర్ తప్పుపట్టారు. అయినా ప్రతిపక్ష ఎమ్మెల్యే జగ్గారెడ్డి అధికార పార్టీ ఎంపీ, ఎమ్మెల్యేలను బాగా చూసుకోవడం ఏమిటి..? ఈ మాటలు దేనికి సంకేతం. ఇవే మాటలు చింతతో పాటు పార్టీ శ్రేణుల్లో ఆగ్రహాన్ని పుట్టించాయి.
ఈ క్రమంలోనే చింతా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. భవిష్యత్ కార్యచరణపై సన్నిహితులతో చర్చిస్తున్నట్లు ‘దిశ’ కథనంలో వెల్లడించిన విషయం తెలిసిందే. చింతా ప్రభాకర్ అలిగి, పార్టీ మారే యోచనలో ఉన్న విషయం తెలుసుకున్న మంత్రి హరీష్‌రావు ఆయనకు ఫోన్ చేసినట్లు తెలిసింది. దీంతో బుధవారం ఉదయం జిల్లాకు చెందిన నాయకులతో కలిసి ప్రభాకర్ మంత్రి వద్దకు వెళ్లారు. ఉద్యమ సమయం నుంచి ఉంటున్న నీకు పార్టీ అండగా ఉంటుందని హరీష్‌రావు భరోసా ఇచ్చినట్లు తెలిసింది. ఉత్సాహంగా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనాలని మంత్రి సూచించారు. సంగారెడ్డిలో పార్టీకి పెద్ద దిక్కు మీరేనని, నాయకులు, కార్యకర్తలతో కలిసి పనిచేయాలని సూచించారు. టెన్షన్ వద్దు చింతా..నేనున్నా అని మంత్రి హరీష్‌రావు ప్రభాకర్‌కు భరోసా ఇచ్చి పంపించినట్లు ఆయన సన్నిహితులు వెల్లడించారు. కాగా మరో సారి చింతా ప్రభాకర్ గురువారం మంత్రి హరీష్ రావును కలిసే అవకాశం ఉన్నట్లు సమాచారం.