చింగారీ యాప్‌.. సులభంగా హ్యాక్?

by Harish |
చింగారీ యాప్‌.. సులభంగా హ్యాక్?
X

భారతదేశంలో టిక్‌టాక్ నిషేధానికి గురైన రెండు రోజుల్లోనే చింగారీ యాప్ బాగా పాపులర్ అయింది. అచ్చం టిక్‌టాక్ లాంటి ఫీచర్లు, స్టైల్‌తో వినియోగదారులను బాగా ఆకట్టుకుంటోంది. అయితే ఆ యాప్‌ను సులభంగా హ్యాక్ చేయొచ్చని ఓ ఎథికల్ హ్యాకర్ ఆరోపిస్తున్నాడు. అంతేకాదు ఎలా హ్యాక్ చేయొచ్చో కూడా వీడియో ద్వారా చూపించాడు. అందులో ఒకరి చింగారీ ఖాతాను హ్యాక్ చేసి, వారి ప్రొఫైల్‌ను ఎలా కంట్రోల్ చేయొచ్చనే విషయాన్ని స్పష్టంగా వివరించాడు. వ్యక్తిగత సమాచారాన్ని సేకరించడమే కాకుండా వినియోగదారుని అనుమతి లేకుండా వీడియోలను అప్‌లోడ్ చేయడం, పరిమితులు విధించడం వంటి పనులు కూడా చేయొచ్చని నిరూపించాడు.

దుబాయ్‌లో ఎన్‌కోడ్ కంపెనీలో పనిచేసే గిరీష్ కుమార్ ఈ పని చేశారు. గూగుల్ ఖాతాలోని బేసిక్ ప్రొఫైల్ యాక్సెస్ మాదిరిగా చింగారీ ఇంటర్‌ఫేస్ ఉండటం హ్యాకింగ్‌ను సులభతరం చేసిందని కుమారు అంటున్నారు. అయితే గూగుల్‌లో వ్యక్తిగత సమాచారాన్ని ఎన్‌క్రిప్ట్ చేయగల సీక్రెట్ టోకెన్ మెకానిజం, చింగారీ యాప్‌‌లో లేకపోవడం వల్ల ఈ హ్యాకింగ్ సాధ్యమైందని కుమార్ చెప్పాడు. అంతేకాకుండా హెచ్‌టీటీపీ రిక్వెస్ట్ యాక్సెస్ ద్వారా కూడా వినియోగదారుని ఖాతాను, సమాచారాన్ని కంట్రోల్‌లోకి తీసుకోవచ్చని వివరించారు. అలాగే ఈ విషయం గురించి నేరుగా చింగారీ యాప్ వారికి సమాచారాన్ని కూడా అందించాడు. అయితే ఈ విషయం గురించి చింగారీ యాప్ వారు స్పందిస్తూ 2.4.0 వెర్షన్‌లో ఈ సెక్యూరిటీ లోపాన్ని తాము గమనించినట్లు, ఇప్పటికే దీన్ని ఫిక్స్ చేస్తూ ఆండ్రాయిడ్ ప్లే స్లోర్, యాపిల్ యాప్ స్టోర్‌కు అప్‌డేట్స్ కూడా పంపినట్లు చింగారీ ప్రతినిధులు ప్రకటించారు.

Advertisement

Next Story

Most Viewed