- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
చైనా కొత్త కుట్ర.. వాళ్లు దేశం విడిచి వెళ్లకుండా
దిశ, వెబ్ డెస్క్ : ఇతర దేశాల భూ భాగాల్ని ఆక్రమించుకునేందుకు చైనా కుట్రలు చేస్తుంది. అందుకు తగ్గట్లు తన సహరిద్దు దేశాలతో కయ్యానికి కాలు దువ్వుతుంది. తాజాగా డ్రాగన్ కంట్రీ మయన్మార్ సరిహద్దు వెంబడి సుమారు 2వేల కిలోమీటర్ల దూరం ముళ్లతీగలతో గోడను నిర్మించే పనిలోపడింది. దీంతో చైనా తీరుపై ప్రత్యర్ధి దేశాలు మండిపడుతున్నాయి. అగ్రరాజ్యం అమెరికా సైతం చైనా విస్తరణవాద ఆలోచనను ప్రతిబింబిచేలా ఆందోళన వ్యక్తం చేస్తుంది.
అయితే చైనా వాయిస్ ను వినిపించే ఆ దేశ మీడియా గ్లోబల్ టైమ్స్ మాత్రం విదేశీయుల ఆక్రమణల్ని నిర్మూలించేందుకు చైనా సౌత్ వెస్ట్రన్ యూనాన్ ప్రావిన్స్ లో 9 మీటర్ల ఎత్తులో ఈ ముళ్ల తీగలతో గోడను నిర్మిస్తున్నట్లు చెప్పింది. కానీ అమెరికాకు చెందిన రేడియా ఫ్రీ ఏసియా రిపోర్ట్ మాత్రం చైనా ప్రభుత్వ తీరును విమర్శించే విదేశీయుల్ని కానీ, స్వదేశీయుల్ని కానీ దేశాన్ని విడిచి పెట్టి పారిపోయే ప్రయత్నాన్ని నిలువరించేందుకేనని పేర్కొంది.
మరోవైపు చైనా తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన మయన్మార్… 1961 సరిహద్దు ఒప్పందం గురించి ప్రస్తావిస్తూ చైనాకు లేఖ రాసింది. ఈ నిబంధనలలో సరిహద్దు 10 మీటర్లలోపు ఎటువంటి నిర్మాణాన్ని నిర్మించకూడదని లేఖలో పేర్కొంది.