‘చైనాతో అవుతోందని ఆశిస్తున్న’

by Shamantha N |
‘చైనాతో అవుతోందని ఆశిస్తున్న’
X

శ్రీనగర్: జమ్ము కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించిన ఆర్టికల్ 370ని నిర్వీర్యం చేసిన కేంద్ర సర్కారు నిర్ణయంతోనే సరిహద్దులో చైనా దుందుడుకు చర్యలకు పాల్పడుతున్నదని మాజీ సీఎం ఫరూఖ్ అబ్దుల్లా అన్నారు. 2019 ఆగస్టు 5న కేంద్రం తీసుకున్న నిర్ణయం ఎప్పటికీ అంగీకరించబోమని చెప్పారు. అధికరణం 370 రద్దును చైనా అంగీకరించలేదని, డ్రాగన్ మద్దతుతోనైనా అధికరణం 370 పునరుద్ధరించబడుతుందని ఆశిస్తున్నట్టు తెలిపారు. ‘చైనా అధ్యక్షుడిని నేను ఆహ్వానించలేదు. ప్రధాని మోడీనే అతన్ని ఆహ్వానించి కలిసి ఊయల ఊగారు. ఆయనను చెన్నై తీసుకెళ్లి మరీ కలిసి భోజనం చేశారు’ అని అన్నారు. జమ్ము కశ్మీర్ సమస్యను పార్లమెంటులోనూ తనను మాట్లాడనివ్వలేదని పేర్కొన్నారు.



Next Story

Most Viewed