- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఐదు గంటలు నిద్రపోయాడు… ఫేమస్ అయిపోయాడు!
దిశ వెబ్ డెస్క్ : సోషల్ మీడియా పుణ్యాన ఎంతోమంది టాలెంట్ వెలుగులోకి వచ్చింది. చాలా మంది పాపులర్ అయ్యారు. రాత్రికి రాత్రే సెలబ్రిటీ స్టేటస్ దక్కించుకున్న వాళ్లు ఉన్నారు. నాణెనికి ఇది ఒక వైపు. కొంతమంది ఏం చేయకపోయినా.. సరే సోషల్ మీడియా ఫేమస్ చేసేస్తుంది. అలానే చైనాకు చెందిన యువన్సన్ అనే యువకుడా హాయిగా నిద్రపోయి పాపులర్ అయ్యాడు. జియాంగ్జి ప్రావిన్స్‌కి చెందిన యువన్సన్‌కి టిక్‌టాక్‌లో వీడియోలు షేర్ చేస్తూ ఉంటాడు. ఈ క్రమంలో ఫిబ్రవరి 9న ఆ టీనేజర్ తన టిక్‌టాక్‌లో లైవ్‌స్ట్రీమింగ్ పెట్టి పడుకున్నాడు. ఆ ఒక్క వీడియో అతడికి లక్షలమంది అభిమానులకు తెచ్చిపెట్టింది.
కరోనా వైరస్ చైనాలోని వుహాన్ నగరంలో పుట్టిన సంగతి తెల్సిందే. దీంతో కరోనా కట్టడి కోసం చైనా ప్రభుత్వం లాక్ డౌన్ విధించింది. దీంతో కోట్లాది మంది ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. ఈ ఖాళీ సమయంలో యువత సోషల్ మీడియాలో ఆక్టివ్ గా ఉంది. దాంతో కంటెంట్ ఉన్నా లేకపోయినా.. ఏవీ పడితే అవి చూసేస్తున్నారు చైనీయులు. అదే క్రమంలో యువన్సన్ వీడియో కూడా పాపులర్ అయ్యింది. అందరిలానే జియాంగ్జి ప్రావిన్స్ లో ఉండే యువన్సన్ కూడా ఖాళీగానే ఉన్నాడు. తనకి నటుడు కావాలనే కోరిక ఉండేది. దాంతో టిక్ టాక్ లో వీడియోలు చేస్తూ.. వాటిని పోస్ట్ చేసేవాడు. కానీ వాటిని చూసే వారు తక్కువే. అయితే ఫిబ్రవరి 9న యువన్సన్ లైవ్ స్ట్రీమింగ్ పెట్టి పడుకున్నాడు. వాస్తవానికి తను నిద్రపోతున్నప్పుడు గురక వస్తుందా? లేదా తెలుసుకోవడం కోసం లైవ్‌స్ట్రీమింగ్ రికార్డు చేశాడు. ఐదు గంటల తర్వాత నిద్రలేచి చూసే సరికి అతడి లైవ్‌స్ట్రీమింగ్ ని లక్షల మంది చూశారు. దాంతో అతడు షాక్ తిన్నాడు. దీంతో మరికొన్ని నిద్రపోతున్న వీడియోలను పోస్ట్ చేశాడు. అవి కూడా వైరల్ అయ్యాయి. దీంతో అతడి వీడియోలకు వ్యూస్ 1.85 కోట్లకు చేరింది. అలాగే ఫాలోవర్స్ సంఖ్య మిలియన్ కు చేరింది. దీంతో యువన్సన్ ఒక్కసారిగా టిక్ టాక్ స్టార్ అయిపోయాడు.
మళ్లీ ఎప్పుడు పడుకుంటావ్ :
యువన్సన్ రాత్రికే రాత్రే స్టార్ అయిపోయాడు. యువన్సన్ పాపులారిటీ చూసి మీడియా సంస్థలు అతడి ఇంటర్వ్యూలు తీసుకున్నాయి. అయితే ‘అసలు నేను నిద్రపోతున్న వీడియో వీక్షకులను ఎందుకు నచ్చిందో తెలియదు. ఇకపై అలాంటి వీడియోలు చేయను’ అని యువన్సన్ తెలిపాడు. కానీ టిక్ టాక్ యూజర్లు మాత్రం అతడు పడుకున్న వీడియోలే పెట్టమని కామెంట్లు పెడుతున్నారు. సాధారణ వీడియోలు మాకు వద్దంటున్నారు. ‘యువన్సన్ నువ్వు ఎప్పుడు నిద్ర పోతావ్’, ‘నువ్వు ఎందుకు నిద్రపోవట్లేదు’, ‘నువ్ నిద్రపోతున్న వీడియోలు ఏవీ’ అంటూ అభిమానులు అతడి వీడియోల కింద కామెంట్లు పెడుతున్నారు.
ఇంట్లోనే ఉండటంతో.. రొటీన్ వీడియోలు చూసి.. చూసి బోర్ కొట్టేసిందేమో. యువన్సన్ వీడియో .. కాస్త ఫన్నీగా అనిపించడంతో.. చైనీయులు దాన్ని తెగ వైరల్ చేశారు. కరోనా కాలం యువన్సన్ కు బాగానే కలిసి వచ్చింది. ఎన్ని వీడియోలు చేసిన రాని గుర్తింపు.. కేవలం నిద్రపోయి సంపాదించుకున్నాడు. మరి ఈ వీడియో యువన్సన్ కు భవిష్యత్తులో ఎలాంటి అవకాశాలు తీసుకు వస్తాయో అన్నది వేచి చూడాలి.
Tags : corona virus, lockdown, tiktok, china, sleep, vedio, livestreaming, famous, popular