- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
భారత్ పై చైనా ఆగ్రహం ఎందుకంటే…
దిశ వెబ్ డెస్క్: చైనాకు చెందిన 118 యాప్స్ లపై ఇండియా నిషేదం విధించడంపై డ్రాగన్ కంట్రీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ నిషేదం రెండు దేశాల మధ్య ఉన్న ద్వైపాక్షిక వ్యాపార ఒప్పందాలను ఉల్లంఘించడమే అని తెలిపింది. భారత నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నామని చైనా వాణిజ్య శాఖ ప్రతినిధి గో ఫెంగ్ అన్నారు. దేశ భద్రత, డేటా గోప్యత అంశాల్లో వ్యక్త మవుతున్న ఆందోళనల నేపథ్యంలో చైనాకు చెందిన 118 యాప్ లను భారత్ బుధవారం నిషేదించిన సంగతి తెలిసిందే..
కాగా నిషేదిత జాబితాలో బైడు, అలీపే, ఫేస్ యూ లాంటి యాప్ లు ఉన్నాయి. తాజా నిర్ణయంతో నిషేద యాప్ ల సంఖ్య 224కు చేరింది. గతంలో లడఖ్ లో భారత చైనా సైనికుల మధ్య ఘర్షణల నేపథ్యంలో పలు చైనా యాప్ లను భారత్ నిషేదించింది. తాజాగా భారత్ చైనా సరిహద్దుల్లో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో మరో 118 యాప్ లను నిషేదిస్తు భారత్ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.