చైనా ఆర్మీ ఇండియా పై మరో కుట్ర

దిశ, వెబ్‌డెస్క్: ఇండియాను దెబ్బతీసేందుకు చైనా కుట్రలు పన్నుతోంది. ఇదివరకే గాల్వాన్ లోయలో జరిగిన ఘర్షణను యావత్ ప్రపంచం మరవక ముందే.. మరోసారి వక్రబుద్ధి ప్రదర్శించింది. ఈ నేపథ్యంలోనే మంగళవారం భారత్‌ పై దొంగ దెబ్బ కొట్టేందుకు ప్రణాళికలు చేసింది. లద్దాఖ్ ఎల్‌ఏసీ కేంద్రంగా.. గాల్వాన్ లోయలో జరిగిన ఘర్షణ తరహాలో మరో కుట్రకు తెరలేపింది.

ఇందులో భాగంగానే భారత భూభాగంలోకి మరోసారి చొచ్చుకొచ్చేందుకు చైనా బలగాలు ప్రయత్నాలు చేశాయి. రెజింగ్ లా, మచ్‌పూరి ప్రాంతాల్లో చైనా ఆర్మీ బరితెగిస్తూ… కత్తులు, బరిసెలతో భారత సైనికులపై దాడి చేయబోయారు. వెంటనే అప్రమత్తమైన ఇండియన్ ఆర్మీ చైనా బలగాలను తరిమి కొట్టారు. చైనా విస్తరణ వాదపు చర్యలను సహించేది లేదని భారత ప్రభుత్వం హెచ్చరిస్తున్నా.. డ్రాగన్ తీరు మారకపోవడం ప్రపంచ దేశాల్లో ఆందోళన కలిగిస్తోంది.

Advertisement