- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
జూపార్క్‌లోని ఏకైక చింపాంజి మృతి..
దిశప్రతినిధి,హైదరాబాద్ : రాజేంద్రనగర్‌లోని నెహ్రూ జులాజికల్ పార్క్‌లో ఉన్న ఏకైక చింపాంజీ సుజీ గుండెపోటుతో గురువారం ఉదయం మరణించింది. సుజీ వయస్సు 35ఏండ్లు. ఉదయం 8.30 గంటల ప్రాంతంలో నేలపై అచేతనంగా పడియున్న సుజీని జూ పార్క్ సిబ్బంది గుర్తించి అధికారులకు సమాచారమిచ్చారు. ఆ వెంటనే 9 మంది పశు వైద్యులు అక్కడకు చేరుకుని సుజీని పరిక్షించారు. అప్పటికే చింపాంజి చనిపోయినట్లు గుర్తించి జూ అధికారులకు చెప్పారు.
అనంతరం పోస్టుమార్టం చేయగా గుండె పోటుతో ప్రాణాలు వదిలిందని వైద్యులు వివరించారు. ఈ సందర్భంగా క్యూరేటర్ మాట్లాడుతూ.. బుధవారం వరకు పండ్లు, మొలకలు, రసాలు, కొబ్బరి నీళ్ళు తాగిందన్నారు. అప్పుడు అనారోగ్యంతో కూడా కనిపించలేదని తెలిపారు. జూ పార్క్ లో 2012 లో కూడా ఓ చింపాంజి మృత్యువాత పడినట్లు వెల్లడించారు.స్వేచ్చగా తిరుగలేని చింపాంజీల జీవిత కాలం 39ఏండ్లు క్యూరేటర్ చెప్పుకొచ్చారు.